TS Liquor Shop Lucky Draw: నేడే లిక్కర్ షాప్‌ల లక్కీ డ్రా.. లక్కున్నోళ్లకే మందు లైసెన్సులు!

జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ల పర్యవేక్షణలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా 2,620 లిక్కర్ షాపులకు లక్కీ డ్రా నిర్వహించనున్నారు. ఇందులో పేర్లు వచ్చిన వారికి రెండేళ్లపాటు లైసెన్సులు మంజూరు చేస్తారు. ఆగస్టు 4 నుంచి ప్రారంభమైన దరఖాస్తు స్వీకరణ ఆసగ్టు 18తో ముగిసిన సంగతి తెలిసిందే. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 294 మద్యం దుకాణాలకు కనీవినీ ఎరుగని రీతిలో దాదాపు 15,894 దరకాస్తులు వచ్చిపడ్డాయి. రంగారెడ్డి జిల్లాలో 234 మద్యం షాపులకు 21,615 దరఖాస్తులు వచ్చాయి...

TS Liquor Shop Lucky Draw: నేడే లిక్కర్ షాప్‌ల లక్కీ డ్రా.. లక్కున్నోళ్లకే మందు లైసెన్సులు!
Liquor Sale
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 21, 2023 | 7:33 AM

హైదరాబాద్‌, ఆగస్టు 21: జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ల పర్యవేక్షణలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా 2,620 లిక్కర్ షాపులకు లక్కీ డ్రా నిర్వహించనున్నారు. ఇందులో పేర్లు వచ్చిన వారికి రెండేళ్లపాటు లైసెన్సులు మంజూరు చేస్తారు. ఆగస్టు 4 నుంచి ప్రారంభమైన దరఖాస్తు స్వీకరణ ఆసగ్టు 18తో ముగిసిన సంగతి తెలిసిందే. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 294 మద్యం దుకాణాలకు కనీవినీ ఎరుగని రీతిలో దాదాపు 15,894 దరకాస్తులు వచ్చిపడ్డాయి. రంగారెడ్డి జిల్లాలో 234 మద్యం షాపులకు 21,615 దరఖాస్తులు వచ్చాయి. సరూర్‌నగర్‌ ఎక్సైజ్‌ యూనిట్‌ పరిధిలోని 134 మద్యం షాపులకు 10,994 దరఖాస్తులు, శంషాబాద్‌ ఎక్సైజ్‌ యూనిట్‌ పరిధిలోని 100 మద్యం షాపులకు 10,621 దరఖాస్తులు.. ఇలా ఏ జిల్లాలో చూసినా రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 1,31,493 దరఖాస్తులు వచ్చిపడ్డాయి.

దీంతో లక్కీ డ్రా కార్యక్రమం ఉత్కంఠ భరితంగా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో ఆగస్టు 21 (సోమవారం) లిక్కర్ షాపుల లక్కీ డ్రా తీయనున్నారు. ఈ ప్రక్రియ జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో వీడియో సమక్షంలో ఈ లాటరీ కార్యక్రమాన్ని పారదర్శంగా, పకడ్భందీగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అన్ని జిల్లా కేంద్రాల్లో లక్కీ డ్రా నిర్వహణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశారు. లాటరీలో విజేతలకు వెంటనే షాపుల కేటాయింపు ఉత్తర్వులు అందజేయాలని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌ అధికారులను ఆదేశించారు. మరో వైపు అధికార పార్టీ అభ్యర్థుల తొలిజాబితా వెల్లడి నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు లిక్కర్ షాప్‌ల లక్కు… మరోవైపు టిక్కెట్ కోసం ఉత్కంఠ భరితంగా ఎదురుచూపులు చూస్తున్నారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, లిక్కర్ వ్యాపారుల్లో లబ్ డబ్.. లబ్ డబ్ ప్రారంభమైంది.

ఇక ఈ రోజు సోమవారం ఉదయం 10 గంటలకు శంషాబాద్‌లోని మల్లికా కన్వెన్షన్‌ హాల్‌లో నిర్వహించనున్న లక్కీ డ్రా కార్యక్రమానికి ఎంట్రీ పాసులు ఉన్నవారిని మాత్రమే అనుమతించాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ స్పష్టం చేశారు. లాటరీ ప్రక్రియ విషయంలో చిన్న పొరపాటు జరిగినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు మహబూబ్‌నగర్‌లోని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ క్యాంప్‌ కార్యాలయంలో ఆదివారం ఎక్సైజ్‌ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆదేశాలు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

నాలుగు రోజుల తర్వాత మళ్లీ పరుగులు.. భారీగా పెరిగిన బంగారం ధర
నాలుగు రోజుల తర్వాత మళ్లీ పరుగులు.. భారీగా పెరిగిన బంగారం ధర
త్వరపడండి.! స్టాక్ అయిపోతోంది.. రూ. 80 వేల ఏసీ కేవలం రూ. 40 వేలకే
త్వరపడండి.! స్టాక్ అయిపోతోంది.. రూ. 80 వేల ఏసీ కేవలం రూ. 40 వేలకే
ఈయన రమ్యకృష్ణకు నాన్న, అన్న, భర్తగా నటించాడా..!!
ఈయన రమ్యకృష్ణకు నాన్న, అన్న, భర్తగా నటించాడా..!!
ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం రోజూ ఈ యోగాసనాలు బెస్ట్ మెడిసిన్..
ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం రోజూ ఈ యోగాసనాలు బెస్ట్ మెడిసిన్..
స్మశానంలో బంగారం వేట.. మృతదేహాల బూడిదలో వెతుకులాట..
స్మశానంలో బంగారం వేట.. మృతదేహాల బూడిదలో వెతుకులాట..
ఏంటిది? ముస్లిం మత పెద్దను కలిసిన స్టార్ నటిపై నెటిజన్ల ఆగ్రహం
ఏంటిది? ముస్లిం మత పెద్దను కలిసిన స్టార్ నటిపై నెటిజన్ల ఆగ్రహం
కురుక్షేత్రలో ఈ నెల 28 నుంచి గీతా మహోత్సవ వేడుకలు..
కురుక్షేత్రలో ఈ నెల 28 నుంచి గీతా మహోత్సవ వేడుకలు..
మీ రైలు టికెట్‌పై మరొకరు ప్రయాణించవచ్చా? రైల్వే నిబంధనలు ఏంటి?
మీ రైలు టికెట్‌పై మరొకరు ప్రయాణించవచ్చా? రైల్వే నిబంధనలు ఏంటి?
రాశి నాథుడి అనుకూలత.. వారి జీవితాలు నల్లేరుపై బండి నడకే..!
రాశి నాథుడి అనుకూలత.. వారి జీవితాలు నల్లేరుపై బండి నడకే..!
డబుల్ ఇస్మార్ట్ బ్యూటీ నెట్టింట సెగలు రేపుతోందిగా..!
డబుల్ ఇస్మార్ట్ బ్యూటీ నెట్టింట సెగలు రేపుతోందిగా..!