Rajinikanth Video: సీఎం పాదాలకు నమస్కరించిన సూపర్‌స్టార్ రజినీకాంత్.. మండిపడుతోన్న నెటిజన్లు
శనివారం లక్నోలోని సీఎం యోగి నివాసంలో కలుసుకుని ఎవరూ ఊహించని విధంగా ఆయన కాళ్లకు నమస్కరించారు రజినీ. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన రజనీ అభిమానులు కొందరు రజనీ తీరును తప్పుబడుతున్నారు. మరికొందరైతే సూపర్ స్టార్ చేసిన పనిని సమర్థిస్తున్నారు. అసలు రజినీకాంత్ ఎందుకలా చేశారనే దానిపై నెట్టింట పెద్ద చర్చనే జరుగుతోంది. తన కంటే వయసులో చాలా చిన్నవాడైనా యోగి కాళ్లకు రజనీ నమస్కరించాల్సిన..
లక్నో, ఆగస్టు 20: సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మువీ ‘జైలర్’ బాక్సాఫీస్ వద్ద షేక్ చేస్తోంది. ఇప్పటి వరకు దాదాపు రూ.500 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. మరో వైపు తలైవా ఈ భారీ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మువీలో రజనీకాంత్‌తోపాటు ప్రియాంక మోహన్, తమన్నా భాటియా, రమ్య కృష్ణన్, యోగి బాబు, వసంత్ రవి, వినాయకన్, సునీల్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. సినిమా రిలీజ్‌కు ముందే ఆయన హిమాలయాలకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రజినీ ఉత్తర్‌ప్రదేశ్‌లో కూడా పర్యటిస్తున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి యాక్షన్ థ్రిల్లర్ మువీ జైలర్ చూసేందుకు శుక్రవారం (ఆగస్టు 18) లక్నో వెళ్లారు. సీఎం యోగితో కలిసి ఈ మువీ చూడనున్నట్లు ఆయన యూపీ పర్యటనకు ముందు మీడియాకు వెళ్లడించిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా శనివారం లక్నోలోని సీఎం యోగి నివాసంలో కలుసుకుని ఎవరూ ఊహించని విధంగా ఆయన కాళ్లకు నమస్కరించారు రజినీ. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన రజనీ అభిమానులు కొందరు రజనీ తీరును తప్పుబడుతున్నారు. మరికొందరైతే సూపర్ స్టార్ చేసిన పనిని సమర్థిస్తున్నారు. అసలు రజినీకాంత్ ఎందుకలా చేశారనే దానిపై నెట్టింట పెద్ద చర్చనే జరుగుతోంది. తన కంటే వయసులో చాలా చిన్నవాడైనా యోగి కాళ్లకు రజనీ నమస్కరించాల్సిన అవసరం ఏం ఉందని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఉత్తరప్రదేశ్ సీఎం నివాసానికి కారులో చేరుకున్న రజినీ..
#WATCH UP: Actor Rajinikanth leaves for Ayodhya from Lucknow pic.twitter.com/fYFK0ncF0b
— ANI (@ANI) August 20, 2023
అయితే రజినీకాంత్ ముఖ్యమంత్రి కాళ్లు మొక్కలేదని, సీఎం యోగి సన్యాసి కాబట్టే అలా చేశాడని మరి కొందరు మద్దతుదారులు రజినీ చేసిన పనిని సమర్ధిస్తున్నారు. రజినీకాంత్‌కు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యోగి గతంలో గోరఖ్ పూర్ పీఠాధిపతి పదవిలో ఉన్నారు. ఆ భక్తి భావంతోనే యోగి పాదాలకు రజనీకాంత్ నమస్కరించారని భావిస్తున్నారు. ఏది ఏమైనా వయసులో చిన్నవాడైనా యోగి కాళ్లకు తలైవా నమస్కరించడం కొందరికి సుతారం నచ్చలేదు.
సీఎం యోగి కాళ్లకు రజినీ నమస్కరిస్తోన్న వీడియో..
Rajnikanth who is both bigger in stature and age than Yogi Adityanath is touching his feet.
Rajnikanth is 72, Yogi is 51.
Why is a superstar touching the feet of a politician? He lost all respect today. pic.twitter.com/edY8rjJ6g9
— Roshan Rai (@RoshanKrRaii) August 19, 2023
ఇంతచేసీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి జైలర్ సినిమా చూసేందుకు వెళ్లిన రజినీకాంత్ ఆయనతో కలిసి సినిమా చూడలేకపోయారు. అత్యవసర పనుల కారణంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ అందుబాటులో లేకపోవడమే అందుకు కారణం. దీంతో యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యతో కలిసి రజినీ జైలర్ మువీని వీక్షించారు. ఆ తర్వాత లక్నోలోని యోగి ఆదిత్యనాథ్ నివాసానికి వెళ్లి కలవగా అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. ఆదివారం అయోధ్యలో రజనీకాంత్ పర్యటించనున్నారు. ఉత్తరప్రదేశ్ పర్యటనకు ముందు జార్ఖండ్ సందర్శించారు. అక్కడ ప్రఖ్యాత చిన్నమస్తా ఆలయాన్ని ఆయన సందర్శించారు. అనంతరం రాజ్ భవన్‌లో జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో చర్చలు జరిపారు.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.