AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: మహేశ్‌ ఇంట విషాదం.. ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేసిన సితారా!

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ప్రధానపాత్రలో 'గుంటూరు కారం' మువీలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌ రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు. ఇక మహేశ్‌ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. కుటుంబ ప్రేక్షకులు మెచ్చే మాస్‌ యాక్షన్‌ కథాంశంతో మేకర్స్‌ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో మహేశ్‌ మాస్‌ గెటప్‌లో సరికొత్తగా కనిపించనున్న సంగతి తెలిసిందే. తమన్‌ సంగీత..

Mahesh Babu: మహేశ్‌ ఇంట విషాదం.. ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేసిన సితారా!
Mahesh Babu
Srilakshmi C
|

Updated on: Aug 18, 2023 | 3:20 PM

Share

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ప్రధానపాత్రలో ‘గుంటూరు కారం’ మువీలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌ రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు. ఇక మహేశ్‌ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. కుటుంబ ప్రేక్షకులు మెచ్చే మాస్‌ యాక్షన్‌ కథాంశంతో మేకర్స్‌ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో మహేశ్‌ మాస్‌ గెటప్‌లో సరికొత్తగా కనిపించనున్న సంగతి తెలిసిందే. పాటల మాంత్రికుడు తమన్‌ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

మరోవైపు రాజమౌళి మూవీ కోసం మహేశ్‌ ఇప్పటినుంచి సరికొత్త లుక్‌లో కనిపించేందుకు ఫిజికల్‌గా సిద్ధమవుతున్నాడు. సినిమాల విషయం పక్కన పెడితే తాజాగా మహేశ్‌ ఇంట విషాదం చోటుచేసుకుంది. విషాదం అంటే కుటుంబ సభ్యులకు ఏమీ కాలేదు. మహేశ్‌ ఫ్యామిలీ ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న పెట్ డాగ్‌ మృతి చెందింది.

ఇవి కూడా చదవండి

నమ్రతా ఇన్ స్టా పోప్టు ఇదే..

ఈ విషయాన్ని నెటిజన్లతో పంచుకుంటూ మహేశ్‌ కూతురు సితార కన్నీళ్లు పెట్టుకుంది. గతంలో తమ పెట్ డాగ్‌ ఫ్లూటోతో ఉన్న బాండింగ్‌ను గుర్తు చేసుకుంటూ, దానితో దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో పోస్టు పెడుతూ ఎమోషనల్‌ అయ్యింది. దాదాపు ఏడేళ్ల నుంచి ఫ్లూటోతో మహేశ్ కుటుంబానికి అనుబంధం ఉంది. ఇప్పుడు అది చనిపోవడంతో ఎమోషనల్‌ అయ్యారు. ఇక తల్లి నమ్రత ‘ఫ్లూటో ఎప్పటికీ మన గుండెల్లో ఉంటుందని’ ఇన్‌స్టాలో పేర్కొంది. ఈ నేపథ్యంలో సితారాను ఓదార్చుతూ మహేశ్ అభిమానులు కామెంట్ సెక్షన్‌లో పోస్టులు పెడుతున్నారు.

సితార ఘట్టమనేని పోస్టు ఇదే..

కాగా టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, నమ్రతా శిరోద్కర్‌ల తనయ చిన్నతనం నుంచే తనదైన రీతిలో పాపులారిటీ దక్కించుకుంటోంది. సాధారణంగా స్టార్‌ కిడ్స్‌ ఎక్కడనున్న సెలబ్రెటీల మాదిరిగానే చూస్తారు. కానీ మహేశ్‌ కూతురు సితార మాత్రం ప్రకటనల్లో నటిస్తూ ప్రత్యేస్తూ, సోషల్‌ సర్వీస్‌ చేస్తూ ప్రత్యేకతను చాటుతోంది. ఆ మధ్య సితార బర్తెడేకి ఎలాంటి హంగులు, ఆర్భాటాలు, కేక్‌ కటింగులు లేకుండా సింపుల్‌గా మహేష్‌ బాబు ఫౌండేషన్‌లోని అమ్మాయిలతో కలిసి సెలబ్రేట్‌ చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అనంతరం వారందరికీ పింక్‌ కలర్‌ సైకిళ్లను బహుమతిగా ఇచ్చింది. ఇతరులపై అమితమైన ప్రేమను చూపిస్తూ తండ్రి బాటలోనే నడుస్తోంది సితారం. దీంతో చిన్న తనం నుంచే సితారా కూడా సెలబ్రెటీ లిస్టులో చేరిపోయింది. తాజాగా తమ ఇంట్లోని పెంపుడు కుక్క చనిపోవడంతో సితారా బాధపడుతూ సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us