AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: దగ్గరుండి భర్తకు రెండో పెళ్లి చేయించి.. న్యాయం చేయాలంటూ రచ్చ.. చివరికి!

బంజారాహిల్స్‌లోని సింగాడి కుంట బస్తీకి చెందిన ఓ యువతి (20) హోం ట్యూటర్‌గా పనిచేస్తుంది. ఈ క్రమంలో క్లాసికల్ డ్యాన్స్‌ నేర్చుకునేందుకు 2020లో యూసుఫ్‌గూడలోని ఓ డ్యాన్స్‌ అకాడమీలో శిక్షణ తీసుకొనేందుకు వెళ్లింది. అక్కడ యువతికి గాంధీ(23) అనే యూట్యూబర్‌తో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారి.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరువర్గాల పెద్దలు అంగీకరించి నిశ్చితార్థం చేయడంతో సహజీవనం చేస్తున్నారు. గాంధీకి రోజా అనే మరో యువతితో సంబంధం..

Hyderabad: దగ్గరుండి భర్తకు రెండో పెళ్లి చేయించి.. న్యాయం చేయాలంటూ రచ్చ.. చివరికి!
Youtuber Gandhi
Srilakshmi C
|

Updated on: Aug 17, 2023 | 1:12 PM

Share

హైదరాబాద్, ఆగస్టు 17: మొదటి భార్యకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా మొదటి భార్యను వేధింపులకు గురి చేశాడు. బాధితురాలు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిత్యపెళ్లి కొడుకును అరెస్ట్‌ చేసి కటకటాల వెనుక వేశారు. ఎస్సై రవీందర్‌ తెలిపిన వివరాల ప్రకారం..

బంజారాహిల్స్‌లో నివాసం ఉంటోన్న ఓ యువతి (20) హోం ట్యూటర్‌గా పనిచేస్తుంది. ఈ క్రమంలో క్లాసికల్ డ్యాన్స్‌ నేర్చుకునేందుకు 2020లో యూసుఫ్‌గూడలోని ఓ డ్యాన్స్‌ అకాడమీలో శిక్షణ తీసుకొనేందుకు వెళ్లింది. అక్కడ యువతికి గాంధీ(23) అనే యూట్యూబర్‌తో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారి.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరువర్గాల పెద్దలు అంగీకరించి నిశ్చితార్థం చేయడంతో సహజీవనం చేస్తున్నారు. గాంధీకి రోజా అనే మరో యువతితో సంబంధం ఉందని సదరు యువతి అనుమానించింది. ఈ క్రమంలోనే ఇరు కుటుంబాల మధ్య మనస్పర్థలు రావడంతో గొడవలు పడి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అరెస్ట్‌ చేస్తారనే భయంతో మొదటి భార్యను ఒప్పించి బాధిత మహిళను రెండో వివాహం చేసుకోవడానికి అంగీకరించజేశాడు.

ఆ తర్వాత రోజా, గాంధీ ఇద్దరు తాము మంచి స్నేహితులమని నమ్మబలికారు. దీంతో ఇరువర్గాల మధ్య రాజీ కుదిరగా మే 14న వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నారు. రోజా దగ్గరుండి అన్ని బాధ్యతలను తీసుకొని పెద్దల సమక్షంలో వీరి వివాహం జరిపించింది. వివాహం జరిగిన కొన్నాళ్ల వరకు అంతా సజావుగానే ఉన్నా.. కొద్ది రోజులుగా గాంధీ ప్రవర్తనలో రెండో భార్యకు మార్పుకనిపించింది. క్రమంగా గాంధీ ఇంటికి ఆలస్యంగా రావడం, ప్రశ్నిస్తే కొట్టడం వంటివి చేయసాగాడు. అసలు విషయం ఆరా తీయగా గాంధీ, రోజా ఇద్దరు తమ పెళ్లికి కొద్ది రోజుల ముందే పెళ్లి చేసుకున్నట్లు రెండో భార్య తెలుసుకుంది. దీంతో మంగళవారం బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 12 వద్ద తీవ్ర ఘర్షణ జరిగింది. రోజా మరికొంతమందిని వెంటబెట్టుకుని వచ్చి తనకూ న్యాయం చేయాలంటూ గొడవకు దిగింది. తాను మోసపోయానని గ్రహించిన బాధిత యువతి మంగళవారం రాత్రి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాంధీతోపాటు అతడి మొదటి భార్య రోజాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్