Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో చల్లారని అసంతృప్తులు.. కార్యకర్తల తిరుగుబాటుతో తల పట్టుకుంటున్న నేతలు..
అసంతృప్తిలో టాప్ పొజిషన్లో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చాలా చోట్ల నిత్యం గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ మీటింగ్‌లో అదే జరిగిది. డోర్నకల్ ఇంచార్జ్ రామ్ చంద్రనాయక్ ను, మహబూబాబాద్ ఇంచార్జ్ బలరాంనాయక్ ను సొంత పార్టీ కార్యకర్తలే నిలదీశారు. వారి వర్గీయులు ఎదురుతిరగడంతో ఘర్షణ జరిగింది. అటు వనపర్తి కాంగ్రెస్‌లోనూ సేమ్ సీన్ కనిపిస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అధిష్టానం పార్టీలో జోష్ నింపేందుకు చేయాల్సిన పనులన్నీ చేస్తోంది. కానీ నియోజకవర్గాల్లో బలంగా.. ఐకమత్యంగా ఉండాల్సిన నేతలంతా..

కాంగ్రెస్‌లో అసంతృప్తి చల్లారడం లేదు.. అధికారంలో లేకపోయినా.. అసంతృప్తిలో టాప్ పొజిషన్లో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చాలా చోట్ల నిత్యం గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ మీటింగ్‌లో అదే జరిగిది. డోర్నకల్ ఇంచార్జ్ రామ్ చంద్రనాయక్ ను, మహబూబాబాద్ ఇంచార్జ్ బలరాంనాయక్ ను సొంత పార్టీ కార్యకర్తలే నిలదీశారు. వారి వర్గీయులు ఎదురుతిరగడంతో ఘర్షణ జరిగింది. అటు వనపర్తి కాంగ్రెస్‌లోనూ సేమ్ సీన్ కనిపిస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అధిష్టానం పార్టీలో జోష్ నింపేందుకు చేయాల్సిన పనులన్నీ చేస్తోంది. కానీ నియోజకవర్గాల్లో బలంగా.. ఐకమత్యంగా ఉండాల్సిన నేతలంతా రోడ్డెక్కుతున్నారు. కొట్టుకుంటున్నారు. సొంత పరువే కాకుండా పార్టీ పరువు కూడా తీస్తున్నారు.
మహబూబాబాబ్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి పరమేష్ నాయక్ నేతృత్వంలో.. పట్టణంలోని ఆర్తి గార్డెన్స్‌లో కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మహబూబాబాద్, డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమావేశంలో బలరాంనాయక్ మాట్లాడుతున్న సమయంలో కొంత మంది కార్యకర్తలు ఆయన్ను నిలదీశారు. ఎన్నికల సమయంలో తప్ప కార్యకర్తలకు అందుబాటులో వుండడంలేదని, మీకు ఎందుకు సహకరించాలని నిలదీశారు. ఈ క్రమంలో బలరాం నాయక్ వర్గీయులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇరు వర్గాలు అక్కడే తన్నుకున్నారు.
ఈ వివాదం డోర్నకల్ నేతలను తాకింది. డోర్నకల్‌కు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు డాక్టర్ రాంచంద్రనాయక్ నాయక్ ను నిలదీశారు. కార్యకర్తలను పట్టించుకోని మీకు ఇక్కడ పోటీ చేసే అర్హత లేదని అడ్డుకున్నారు. దీంతో ఓ కార్యకర్త ఏకంగా కర్రలతో రామ్ చంద్రనాయక్‌ను అడ్డుకునే ప్రయత్నాలు చేశాడు. ఈ క్రమంలో రాంచంద్రనాయక్ వర్గీయులు అతన్ని అడ్డుకున్నారు. రెండు వర్గాలు పిడి గుద్దులు గుద్దుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రాంచంద్ర నాయక్ అక్కడి నుండి వెళ్లిపోయారు.




మరోవైపు, వనపర్తి కాంగ్రెస్ సమావేశం రసాభాస అయ్యింది. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనా రెడ్డిపై చిన్నారెడ్డి వర్గం దాడి చేయడంతో.. శివసేనారెడ్డి మధ్యలోనే వెళ్లిపోయారు. మంత్రి నిరంజన్ రెడ్డిని మోసం చేసి వచ్చి ఇక్కడ అలాగే చేద్దాం అనుకుంటే కుదరదు అని కొత్తగా చేరిన ఎంపీపీ మేఘారెడ్డిపై మహిళా కార్యకర్తలు సీరియస్ అయ్యారు. నువ్వు పార్టీలోకి వచ్చి నాలుగు రోజులు కాకముందే టికెట్ ఎలా అడుగుతావ్ అని కార్యకర్తలు నిలదీశారు. ఎన్నికలకు సిద్ధమవుతున్న నేతలకు.. అండగా నిలవాల్సిన కార్యకర్తలే ఇలా ఎదురు తిరుగుతుండడంతో లీడర్లకు దిక్కు తోచడం లేదు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
