Vande Bharat Express: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రద్దు.. దాని స్థానంలో మరో ట్రైన్..
Vande Bharat Express: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ రావాల్సిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ అనివార్య కారణాల వల్ల రద్దయింది. సాంకేతిక కారణాలతో వందే భారత్ రైలును రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 5.45కి వందేభారత్ ట్రైన్ విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ బయలుదేరాల్సి ఉంది.

Visakhapatnam-Secunderabad Vande Bharat Express: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ రావాల్సిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ అనివార్య కారణాల వల్ల రద్దయింది. సాంకేతిక కారణాలతో వందే భారత్ రైలును రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 5.45కి వందేభారత్ ట్రైన్ విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ బయలుదేరాల్సి ఉంది. అయితే, రైలును రద్దుచేయడంతో ప్రత్యామ్నాయంగా మరో రైలును ఏర్పాటు చేశామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్ వందేభారత్ ఆగే స్టాపుల్లోనే ఆగుతుందని వెల్లడించారు. కాగా.. ఈ ట్రైన్ విశాఖపట్నం నుంచి గురువారం ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్‌కు బయలుదేరింది. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని అధికారులు కోరారు.
వందేభారత్ రద్దు దృష్ట్యా మరోట్రైన్ కు సంబంధించి పూర్తి సమాచారం కోసం ఆయా స్టేషన్లలో విచారణ కేంద్రాలు, అధికారులను సంప్రదించాలని రైల్వే సూచించింది. వందేభారత్ ట్రైన్ కోసం టికెట్ రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు ఈ రైలు ఎక్కాలని.. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని అధికారులు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రద్దు దృష్ట్యా ఈరోజు ఉదయం 07:00 గంటలకు ప్రారంభమైన VSKP-SC ప్రత్యేక రైలులో క్యాటరింగ్ సేవలు కూడా ఉన్నాయని తెలిపారు. ప్రయాణికులు ఈ సేవలను పొందాలని అభ్యర్థించారు. దీనికోసం రైలు హాల్టింగ్ స్టేషన్లలో PF నంబర్ 1లో ఫెసిలిటేషన్ కౌంటర్‌ను సంప్రదించాలని రైల్వే అధికారులు కోరారు.




ట్రైన్ క్యాన్సిల్ ట్విట్..
TRAIN CANCELLED ALERT:* Train No:20833 Visakhapatnam -Secunderabad Vanda Bharat Express is Cancelled today i. e 17.08.2023 Inconvenience is regretted. @RailMinIndia @EastCoastRail @drmvijayawada @drmsecunderabad @SCRailwayIndia pic.twitter.com/wQ7NOeDYG7
— DRMWALTAIR (@DRMWaltairECoR) August 17, 2023
కాగా.. వందేభారత్ రైలు రద్దుపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. సాధారణ ట్రైన్ మాదిరిగానే ఇది ప్రయాణం చేస్తోందని.. అయితే, మధ్యలో ఇలాంటి ట్విస్టులు ఏంటంటూ అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
@DRMWaltairECoR Great sir . Running a normal train in lieu of Vande bharat . Means Vande bharat speed can be matched by a normal train also .
— Ashutosh Mantry (@AshutoshMantry) August 17, 2023
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు 20833 నంబర్‌తో, సికింద్రాబాద్ నుంచి విశాఖకు 20834 నంబర్‌తో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ వారంలో ఆరు రోజులు రాకపోకలు సాగిస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం ఈ సర్వీసు అందుబాటులో ఉండదు. ప్రతిరోజు ఉదయం 5.45 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. తిరిగి సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి రాత్రి 11.30 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్ స్టేషన్లలో మాత్రమే ఈ వందేభారత్ ట్రైన్ ఆగుతుంది.
Train related important information* Catering services have been provided on the Special Train from VSKP-SC being run today at 07:00am in view of cancellation of Vande Bharat Express.Passengers are requested to avail these services. Please contact facilitation counter at PF no 1
— DRMWALTAIR (@DRMWaltairECoR) August 17, 2023
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..