Andhra Pradesh: ఏపీ రాజకీయాల్లో ఎరుపురంగు పులుముకున్న ఎర్రమట్టి దిబ్బలు.. పవన్ కల్యాణ్‌కు వైసీపీ కౌంటర్ ఇదే..
Jansasena vs YSRCP: ఎన్నో సినిమాల్లో కనిపించిన ఎర్రమట్టి దిబ్బలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి. భీమలి నియోజకవర్గంలోని ఎర్రమట్టి దిబ్బలను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సందర్శించారు. ఎర్రమట్టి దిబ్బలు ధ్వంసానికి గురయ్యాయని పవన్ కల్యాణ్ ఆరోపిస్తున్నారు. ఎర్రమట్టి దిబ్బల్లోని వ్యూ పాయింట్ నుంచి పరిశీలించారు.
Jansasena vs YSRCP: ఎన్నో సినిమాల్లో కనిపించిన ఎర్రమట్టి దిబ్బలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి. భీమలి నియోజకవర్గంలోని ఎర్రమట్టి దిబ్బలను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సందర్శించారు. ఎర్రమట్టి దిబ్బలు ధ్వంసానికి గురయ్యాయని పవన్ కల్యాణ్ ఆరోపిస్తున్నారు. ఎర్రమట్టి దిబ్బల్లోని వ్యూ పాయింట్ నుంచి పరిశీలించారు. 12 వేల ఎకరాలున్న ఎర్రమట్టి దిబ్బలు ప్రస్తుతం 292 ఎకరాలు మాత్రమే మిగిలాయి. ఈ హెరిటేజ్ సైట్‌ను సంరక్షించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో 48 గంటల్లోగా తేల్చి చెప్పాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ వ్యవహారాన్ని గ్రీన్ ట్రిబ్యునల్ ముందుకు తీసుకెళ్తామని హెచ్చరించారు.
ఎర్రమట్టి దిబ్బలపై పవన్ వ్యాఖ్యలను మంత్రి అమర్‌నాథ్ ఖండించారు. ఎర్రమట్టి దిబ్బలకు జియో హెరిటేజ్ ట్యాగ్ ఉంది..వాటిని రాష్ట్రప్రభుత్వమే పరిరక్షిస్తోందని అమర్‌నాథ్ చెప్పారు. చంద్రబాబు గైడెన్స్ మేరకే పవన్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని.. పవన్ తీరు చిన్నపిల్లల చేష్టల్లా ఉన్నాయన్నారు మంత్రి అమర్‌నాథ్.. పవన్ పొలిటికల్ టూర్స్ కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉన్నాయని ఎద్దేవా చేశారు.. ఎర్రమట్టి దిబ్బలకు జియో హెరిటేజ్ ట్యాగ్ ఉంది.. వాటిని రాష్ట్రప్రభుత్వమే పరిరక్షిస్తోందని అమర్‌నాథ్ పేర్కొన్నారు. చంద్రబాబు గైడెన్స్ మేరకే పవన్ అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎర్రమట్టి దిబ్బలో అక్రమాలు జరిగిపోతున్నాయని చెప్పడం హాస్యస్పదమని.. పవన్ కార్యక్రమాలు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉన్నాయంటూ ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి అమర్‌నాథ్ విమర్శించారు.
మరో వైపు ప్రజా కోర్టు, ప్రజావాణి వంటి పవన్ కార్యక్రమాలు సినిమా టైటిల్స్, టీవీ సీరియల్స్‌కు పనికొస్తాయి తప్ప జనాలకు వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని వైసీపీ నేత పేర్ని నాని ఆరోపించారు. గోదావరి జిల్లాల తర్వాత.. విశాఖ టూర్‌లో పవన్ కల్యాణ్ ఫుల్ జోష్‌తో ఉన్నారు. మరి ఆయన ప్రశ్నలకు ప్రభుత్వం ఆన్సర్ ఇస్తుందా.. ఎర్రమట్టి దిబ్బల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు ప్రకటిస్తుందా? లేదా అన్నది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..