Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: మరీ ఇంత వెర్రి పుష్పంలా ఉన్నావేంటి సామీ.. దోమను చంపేందుకు సుత్తితొ కొట్టాడు.. కట్ చేస్తే ఆస్పత్రి బెడ్‌పై..

మనం చిన్నప్పటి నుంచి ఒక కథ వింటుంటాం.. ‘అనగనగా ఓ రాజు ఉంటాడు. ఆ రాజుకు మనుషులపై నమ్మకం లేక కోతులను సెక్యూరిటీగా పెట్టుకుంటాడు. వాటికి ఆయుధాలు కూడా ఇస్తాడు. ఓ రోజు రాజు నిద్రపోతుంటాడు. ఆ సమయంలో రాజు ముక్కుపై ఈగ వాలుతుంది. అయితే, ఆ ఈగ తమ రాజుకు హానీ చేస్తుందని భావించి.. సెక్యూరిటీ కోతి తన కరవాలం తీసి ఒక్క వేటు వేస్తుంది. కానీ, ఈగను చంపేందుకు కోతి ప్రయత్నిస్తే.. కత్తి వేటు దెబ్బకు రాజు ప్రాణాలు కోల్పోయాడు.’ అచ్చం ఇలాంటి ఘటనకు నిదర్శనమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దోమను చంపేబోతే..

Watch Video: మరీ ఇంత వెర్రి పుష్పంలా ఉన్నావేంటి సామీ.. దోమను చంపేందుకు సుత్తితొ కొట్టాడు.. కట్ చేస్తే ఆస్పత్రి బెడ్‌పై..
Mosquito Killing
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 16, 2023 | 9:40 AM

కొందరు ఉంటారు సామీ.. అతి తెలివి ప్రదర్శించి, తమకు తామే ఇబ్బందులు కొనితెచ్చుకుంటారు. వీరి మూర్ఖత్వం పీక్స్‌లో ఉంటుంది. కాలిపై దోమ వాలితే.. దానిని చంపేందుకు సుత్తితో కొట్టాడు ఓ ప్రబుద్ధుడు. అవును, మనం చిన్నప్పటి నుంచి ఒక కథ వింటుంటాం.. ‘అనగనగా ఓ రాజు ఉంటాడు. ఆ రాజుకు మనుషులపై నమ్మకం లేక కోతులను సెక్యూరిటీగా పెట్టుకుంటాడు. వాటికి ఆయుధాలు కూడా ఇస్తాడు. ఓ రోజు రాజు నిద్రపోతుంటాడు. ఆ సమయంలో రాజు ముక్కుపై ఈగ వాలుతుంది. అయితే, ఆ ఈగ తమ రాజుకు హానీ చేస్తుందని భావించి.. సెక్యూరిటీ కోతి తన కరవాలం తీసి ఒక్క వేటు వేస్తుంది. కానీ, ఈగను చంపేందుకు కోతి ప్రయత్నిస్తే.. కత్తి వేటు దెబ్బకు రాజు ప్రాణాలు కోల్పోయాడు.’ అచ్చం ఇలాంటి ఘటనకు నిదర్శనమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దోమను చంపేబోతే కాలు విరిగింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.

అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. సాధారణంగా దోమలు మనపై వాలుతుంటూనే ఉంటాయి. వ్యక్తుల రక్తం తాగుతూ వాటి ఆకలిని తీర్చుకుంటాయి. ఇక ఈ దోమల బారి నుంచి బయటపడేందుకు ఆలౌట్, జెట్ కాయిల్స్ వాడుతూ ఎవరి ప్రయత్నాలు వారు చేస్తారు. కొన్ని సందర్భాల్లో శరీరంపై వాలిన దొమను చంపేందుకు చేతితో కొట్టడం జరుగుతుంది. అచ్చం ఇలాగే ఓ వ్యక్తి కాలిపై కూడా దోమ వాలింది. మరి చేతితో కొడితే ఆ దోమ చచ్చిపోయేదే. కానీ, అతగాని తెలివికి దోమ చావడంతో పాటు.. మరో ఘనకార్యం కూడా జరిగింది. దెబ్బకు ఆస్పత్రికి వెళ్లి కట్లు కట్టించికునే పరిస్థితి ఏర్పడింది.

అవును, కాలిపై దోమ వాలగా.. దాన్ని చంపేందుకు సుత్తిని ఉపయోగించాడు ఓ వ్యక్తి. తన కాలిపై వాలిన దొమను చంపేందుకు సుత్తితో బలంగా కొట్టాడు. దాంతో దోమ చచ్చింది. దోమతో పాటు.. ఆ మేధావి కాలు కూడా విరిగింది. సుత్తితో బలంగా కొట్టుకోవడంతో నొప్పిని తట్టుకోలేక విలవిల్లాడాడు. వెంటనే ఆస్పత్రికి వెళ్లగా.. వైద్యులు పరీక్షించి ఎక్స్‌రే తీశారు. అందులో షాకింగ్ రిజల్ట్స్ వచ్చాయి. సుత్తితో కొట్టడం వలన కాలి వేలు మధ్యలో విరిగిపోయింది. ఇంకేముంది.. డాక్టర్స్ అతనికి కట్టుకట్టి ఇంటికి పంపారు. మరోసారి ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దంటూ హితవు చెప్పారు.

అయితే, ఈ ఫన్నీ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో qazaqsolo అనే ఐడీతో షేర్ చేశారు. ఇప్పటివరకు 6.9 మిలియన్స్ వ్యూస్ రాగా, 2.28 లక్షల లైక్స్ వచ్చాయి. అతని తెలివి తేటలకు జనాలు పడి పడి నవ్వుకుంటున్నారు. మరీ ఇలా ఉన్నావేంట్రా బాబూ అని కామెంట్స్ చేస్తున్నారు. వెర్రిపుష్పం 2.O అని పంచ్‌లు వేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..