Black Tiger : ఒడిషా అడవుల్లో అరుదైన నల్లపులి.. ఏం చేస్తుందో తెలిస్తే షాకవ్వాల్సిందే!

ఈ నల్లపులి కనిపించడం ఇదేం మొదటిసారి కాదు. మూడేళ్ల క్రితం కూడా ఒడిశాకు చెందిన సౌమెన్ బాజ్‌పాయ్ అనే ఔత్సాహిక ఫోటోగ్రాఫర్ ఈ అభయారణ్యంలో నల్లపులిని ఫోటో తీశాడు. ఆ ఫోటో కూడా వైరల్ అయింది. సహజంగానే ఈ వీడియో జంతు ప్రేమికులను ఆకట్టుకుంది. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ డాక్టర్ సామ్రాట్ గౌడ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఆ తర్వాత ఇదే వీడియోను మరో సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి రమేష్ పాండే కూడా షేర్ చేశారు.

Black Tiger : ఒడిషా అడవుల్లో అరుదైన నల్లపులి.. ఏం చేస్తుందో తెలిస్తే షాకవ్వాల్సిందే!
Melanistic Tiger
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 15, 2023 | 10:15 PM

పులి సాధారణ రంగుల గురించి అందరికీ తెలుసు. కానీ కొన్నిసార్లు నల్ల పులులు కూడా చాలా అరుదుగా కనిపిస్తాయి. అదేవిధంగా ఒడిశాలోని సిమిలిపాల్ టైగర్ రిజర్వ్‌లో నల్లపులి కనిపించింది. ఈ పులి చర్మం, వెంట్రుకలలో అసాధారణంగా అధిక స్థాయి నలుపు రంగును కలిగి ఉంటుంది. ఇది సాధారణ పులి కంటే భిన్నంగా కనిపిస్తుంది. ఐతే సహజంగానే ఈ నల్ల పులి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ నల్ల పులులను ఆంగ్లంలో ‘మెలనిస్టిక్ టైగర్’ అంటారు. ఈ సమస్య జన్యుపరమైన లోపం వల్ల వస్తుంది. సిమిలిపాల్ అభయారణ్యంలో ఇలాంటి పులుల సంఖ్య పెరిగింది. నల్లపులి అరుదైన దృశ్యం కెమెరాకు చిక్కింది. ఈ వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారులు తమ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ డాక్టర్ సామ్రాట్ గౌడ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఆ తర్వాత ఇదే వీడియోను మరో సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి రమేష్ పాండే కూడా షేర్ చేశారు. ఒడిశాలోని సిమిలిపాల్ టైగర్ రిజర్వ్‌లో మెలనిస్టిక్ టైగర్ అందమైన వీడియో కెమెరాకు చిక్కింది. అయితే, ఇలాంటి అరుదైన నల్లపులి తను ఎప్పుడూ తిరిగే ప్రాంతాన్ని ఈజీగా గుర్తిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇలాంటి నల్ల పులి తన భూభాగం అని ఇతర పులులకు తెలిసే విధంగా గుర్తులు వేస్తుందట. అందుకోసం చెట్టు బెరడను పీకేస్తూ మార్కులు వేసుకుంటుందట. ఇలాంటి గుర్తుల వల్లే తన లాంటి మరో పులి ఆ ఏరియాలో ఉందని ఇతర పులులు తెలుసుకుంటాయని చెబుతున్నారు. అయితే, జన్యు ఉత్పరివర్తనాల కారణంగానే ఈ పులుల శరీరం నల్లగా మారుతుందని చెబుతున్నారు. ఇదే అనే క్యాప్షన్‌తో రమేష్ పాండే వీడియోను షేర్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ నల్లపులి కనిపించడం ఇదేం మొదటిసారి కాదు. మూడేళ్ల క్రితం కూడా ఒడిశాకు చెందిన సౌమెన్ బాజ్‌పాయ్ అనే ఔత్సాహిక ఫోటోగ్రాఫర్ ఈ అభయారణ్యంలో నల్లపులిని ఫోటో తీశాడు. ఆ ఫోటో కూడా వైరల్ అయింది. సహజంగానే ఈ వీడియో జంతు ప్రేమికులను ఆకట్టుకుంది. ఇది ఇప్పుడు చాలా వ్యూస్‌ని కూడా సంపాదించుకోగలిగింది.

సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసిన వెంటనే వైరల్‌గా మారింది. ఇప్పికే దాదాపు 67,000లకు పైగా వ్యూస్‌ సంపాదించింది. అలాగే వేల సంఖ్యలో లైక్‌లు కూడా వచ్చాయి. కామెంట్‌ బాక్స్‌ నిండా భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

మెలనిస్టిక్ పులిని కొన్నిసార్లు మెలనిజం అని పిలిచే ఒక పరిస్థితితో నల్ల పులి అని కూడా పిలుస్తారు. ఇది ఆ జంతువు శరీరంలో మెలనిన్‌ను అధికంగా ఉత్పత్తి చేస్తుంది. ఇది మానవులు, జంతువుల చర్మం, జుట్టు, కళ్ళకు రంగును ఇచ్చే వర్ణద్రవ్యం. పులులలో దీని కారణంగా వాటి జుట్టు చాలా ముదురు రంగులో ఉంటుంది. కొన్నిసార్లు నల్లగా కూడా ఉంటుంది. వాటి సాధారణ చారలు తక్కువగా కనిపిస్తాయి.

మరిన్ని వైరల్ వార్తల కోసం క్లిక్ చేయండి

ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?