Snake In Cauliflower: బాబోయ్.. కాలీ ఫ్లవర్‌లో కట్ల పాము.. ఒళ్లు జలదరించే షాకింగ్ వీడియో వైరల్..
సాధారణంగా గోబీ, కాలీఫ్లవర్, బ్రోకలీ అంటే చాలా మందికి పంచప్రాణాలు. మరికొందరు అందులోని చిన్న సూక్ష్మక్రిముల వల్ల వాటికి దూరంగా ఉంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఏకంగా పాము కనిపించింది. కాలీఫ్లవర్‌లో ఊహించని ఈ పాము పిల్ల కనిపించడంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. ఈ కుటుంబం మార్కెట్‌లో కూరగాయలు కొని తెచ్చి ఇంట్లో నేలపై పోశారు. అప్పుడు కాలిఫ్లవర్ లోపల ఏదో కదలడం కనిపించింది. అదేంటో తెలుసుకోవాలని వారు కాలీఫ్లవర్ కాడలను ఒక్కొక్కటిగా కట్ చేసి చూశారు..దాంతో అందులోంచి పాము బయటకు వచ్చింది.
Snake In Cauliflower: అసలే ఇది వర్షాకాలం.. వర్షాలు, వరదలతో ఎక్కడ పడితే అక్కడ పాములు, తేళ్లు, చివరకు మొసళ్లు కూడా ప్రత్యక్షమవుతున్నాయి. అందుకే గ్రామాలు, శివారు ప్రాంతాలు, మురికి కాల్వలకు దగ్గర ఉన్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎక్కువ రోజులు వాడకుండా నిరుపయోగంగా ఉన్న ప్రదేశాలు, శిథిలావస్థకు చేరిన నిర్మాణాల్లో ఎక్కువగా పాములు చేరి ఆవాసం ఏర్పాటు చేసుకుంటాయి. ఇక అప్పుడప్పుడు ఇళ్లలోకి కూడా దూరిపోతుంటాయి. ఇంట్లోని ఫ్రిడ్జ్‌లు, కూరగాయల బుట్టలు, బూట్లు, బాత్‌రూమ్ కమోండ్‌లలో కూడా ఇటీవల పాములు ప్రత్యక్షమవుతున్నాయి. ఇక తాజాగా ఓ మహిళ కొనుగోలు చేసిన తెచ్చిన కాలీఫ్లవర్‌లో ఓ పాము కనిపించింది. దీనిని చూసి ఆ మహిళ ఒక్కసారిగా షాక్ గురైంది. కాలీఫ్లవర్‌లో ఏదో కదులుతున్నట్టుగా అనిపించి భయబ్రాంతులకు గురైంది. అవును మీరు విన్నది నిజమే.. కాలీఫ్లవర్‌లో పాము ప్రత్యక్షమైంది.
సాధారణంగా గోబీ, కాలీఫ్లవర్, బ్రోకలీ అంటే చాలా మందికి పంచప్రాణాలు. మరికొందరు అందులోని చిన్న సూక్ష్మక్రిముల వల్ల వాటికి దూరంగా ఉంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఏకంగా పాము కనిపించింది. కాలీఫ్లవర్‌లో ఊహించని ఈ పాము పిల్ల కనిపించడంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. ఈ కుటుంబం మార్కెట్‌లో కూరగాయలు కొని తెచ్చి ఇంట్లో నేలపై పోశారు. అప్పుడు కాలిఫ్లవర్ లోపల ఏదో కదలడం కనిపించింది. అదేంటో తెలుసుకోవాలని వారు కాలీఫ్లవర్ కాడలను ఒక్కొక్కటిగా కట్ చేసి చూశారు..దాంతో అందులోంచి పాము బయటకు వచ్చింది. అయితే, అది మరింత లోపలికి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించింది.
Which type of a Cauliflower is this?🙄🙄 Cobra Cauliflower or Viper Cauliflower 🤔🤔#snake #CobraKai #Viper #vegetables pic.twitter.com/RyuFE85tYv
— Devendra Saini (@dks6720) August 4, 2023
ఈ వీడియో X (Twitter)లో 4వ తేదీన షేర్ చేయబడింది. ఈ మేరకు దేవేంద్ర సైనీ ట్వీట్ చేశారు. అయితే ఇది ఎక్కడ జరిగిందో మాత్రం చెప్పలేదు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా నివ్వెరపోతున్నారు. ఇక నుంచి పచ్చి కూరగాయ ఏదైనా జాగ్రత్తగా పరిశీలించి వండుకుని తినాలని చెబుతున్నారు.
ఈ ఘటన మొదటిది కాదు. ఆగస్టు ప్రారంభంలో, ఇంగ్లాండ్‌లోని వెస్ట్ మిడ్‌లాండ్స్‌లోని బ్రోకలీలో కూడా పాము కనిపించింది.. దీన్ని చూసిన 63 ఏళ్ల నెవిల్ లింటన్ అనే వ్యక్తి షాక్ అయ్యాడు. నెవిల్లే తన ఫ్రిజ్‌లోంచి కూరగాయలను వండడానికి తీసి చూసేసరికి అందులో దాక్కున్న పాము కనిపించింది. ఇప్పుడు అది విషపూరితమైన పాము కాదని తెలిసింది. బ్రోకలీలో పామును చూడగానే నిజంగానే భయపడ్డాను. ఇంతకు ముందు నాకు పాములను పట్టుకోవడం గురించి తెలియదు. అదృష్టవశాత్తూ నేను ఆ బ్రోకలీని వంటగదిలో ఉంచలేదు. గుర్తు చేసుకుంటే ఇంకా భయమేస్తుంది అంటూ లింటన్ అన్నాడు.
మరిన్ని వైరల్ వార్తల కోసం క్లిక్ చేయండి