Skin Care: పచ్చిపాలతో మీ అందం రెట్టింపు.. పట్టులాంటి మెరిసే చర్మం కోసం ఈ సింపుల్‌ ఫేస్‌ ఫ్యాక్‌ ట్రై చేయండి…

పాలు తాగితే బలం వస్తుందని అందరికీ తెలిసిందే. అయితే, పాలతో చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుకోవచ్చని మీకు తెలుసా..? పాలతో తయారు చేసే ఫేస్‌ ప్యాక్‌లు మీ ముఖ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. పాలలోని గుణాలు చర్మంపై మురికిని, మృత కణాలను తొలగిస్తాయి. బ్లాక్ హెడ్స్, మొటిమలు రాకుండా అడ్డుకుంటాయి. ముఖంపై పేరుకుపోయిన జిడ్డుర, మురికి తొలగి పోతుంది. పచ్చి పాలను ఉపయోగించి చేసే ఈ నాలుగు ఫేస్‌ప్యాక్‌లు మిమ్మల్నీ పాలరాతి బొమ్మలా మార్చేస్తాయి. చర్మంపై పాలను ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం..

Skin Care: పచ్చిపాలతో మీ అందం రెట్టింపు.. పట్టులాంటి మెరిసే చర్మం కోసం ఈ సింపుల్‌ ఫేస్‌ ఫ్యాక్‌ ట్రై చేయండి...
Face Packs Made Of Milk
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 15, 2023 | 6:09 PM

పాలు మన ఆరోగ్యంతో పాటు చర్మానికి కూడా మేలు చేస్తాయి. పాలలోని పోషకాలు చర్మాన్ని హైడ్రేట్ చేసి, తేమను అందిస్తాయి. చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. మీ చర్మం కూడా నిస్తేజంగా, నిర్జీవంగా మారినట్లయితే ఈ టిప్స్‌ పాటించండి. చర్మం మళ్లీ మెరుస్తూ కాంతివంతంగా మారేందుకు.. మీరు పాటించే స్కిన్‌ కేర్‌ రోటీన్‌లో పాలను ఉపయోగించవచ్చు. ముఖ్యంగా పచ్చి పాలను చర్మానికి వాడితే చర్మానికి చాలా మేలు చేస్తుంది. మీరు పచ్చి పాలను ఉపయోగించి ఈ నాలుగు రకాల ఫేస్ ప్యాక్స్‌ కూడా తయారు చేసుకోవచ్చు, ఇది చర్మంపై అప్లై చేస్తే చర్మం ఆరోగ్యంగా, మెరుస్తుంది. కాబట్టి చర్మంపై పాలను ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం..

పచ్చి పాలు- తేనె

ఈ ఫేస్ ప్యాక్ చేయడానికి, ఒక గిన్నెలో రెండు చెంచాల పచ్చి పాలను తీసుకుని అందులో ఒక పెద్ద చెంచా తేనె, కొంచెం నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమం సహజ బ్లీచ్‌గా పనిచేస్తుంది. ఈ పేస్ట్‌ను ముఖం, మెడపై రాయండి. 15 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి.

పచ్చి పాలు- నట్స్

ఈ ఫేస్ ప్యాక్ చేయడానికి, బాదంపప్పును పచ్చి పాలలో రాత్రంతా నానబెట్టండి. ఉదయాన్నే దీన్ని పేస్ట్‌లా చేసి ముఖం, మెడకు అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత నీళ్లతో ముఖం కడుక్కోవాలి.

ఇవి కూడా చదవండి

పచ్చి పాలు- పసుపు

మెరిసే చర్మం కోసం మీరు పచ్చి పాలు, పసుపును కూడా ఉపయోగించవచ్చు. అందుకోసం ఒక గిన్నెలో రెండు మూడు చెంచాల పచ్చి పాలను తీసుకుని అందులో ఒక చెంచా పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి.

పచ్చిపాలు- అవోకాడో

ఈ ప్యాక్‌ను తయారు చేయడానికి ఒక గిన్నెలో రెండు చెంచాల పచ్చి పాలను తీసుకొని, అవసరమైన విధంగా మెత్తని అవకాడోను కలుపుకోవాలి. సరిగ్గా మిక్స్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖం, మెడపై పూర్తిగా అప్లై చేసుకోవాలి. అది ఆరిపోయిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!