Kitchen Hacks: పులిపిర్లతో ఇబ్బంది పడుతున్నారా.. కాఫీపొడితో చెక్ పెట్టండిలా!!

పులిపిర్లు (Warts) మనలో చాలా మందిని ఇబ్బంది పెడుతూంటాయి. ముఖం, మెడ భాగాలలో ఇవి ఎక్కువగా వస్తుంటాయి. అయితే చాలా మందికి ఇవి మరీ ఎక్కువగా ఉంటాయి. వీటి కారణంగా.. అందవిహీనంగా కనిపిస్తుంటారు. అయితే నిజానికి ఇవి హ్యూమన్ పాపిలోనా వైరస్ అనే ఇన్ఫెక్షన్ కారణంగా వస్తాయి. శరీరానికి గాయాలైనపుడు ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశించి.. కణాలన్నీ ఒకేప్రాంతంలో పెరిగేలా చేస్తుంది. ఇవన్నీ చర్మంపై పెరిగి క్రమంగా పులి పిర్లుగా రూపాంతరం చెందుతాయి. ఒక దాని వెంట మరొకటి..

Kitchen Hacks: పులిపిర్లతో ఇబ్బంది పడుతున్నారా.. కాఫీపొడితో చెక్ పెట్టండిలా!!
Warts Removing
Follow us
Chinni Enni

|

Updated on: Aug 15, 2023 | 4:30 PM

పులిపిర్లు (Warts) మనలో చాలా మందిని ఇబ్బంది పెడుతూంటాయి. ముఖం, మెడ భాగాలలో ఇవి ఎక్కువగా వస్తుంటాయి. అయితే చాలా మందికి ఇవి మరీ ఎక్కువగా ఉంటాయి. వీటి కారణంగా.. అందవిహీనంగా కనిపిస్తుంటారు. అయితే నిజానికి ఇవి హ్యూమన్ పాపిలోనా వైరస్ అనే ఇన్ఫెక్షన్ కారణంగా వస్తాయి. శరీరానికి గాయాలైనపుడు ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశించి.. కణాలన్నీ ఒకేప్రాంతంలో పెరిగేలా చేస్తుంది. ఇవన్నీ చర్మంపై పెరిగి క్రమంగా పులి పిర్లుగా రూపాంతరం చెందుతాయి. ఒక దాని వెంట మరొకటి.. పులిపిర్లు వస్తూనే ఉంటాయ్.

పులిపిర్లను తగ్గించుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు. కొంత మంది బ్యూటీ పార్లర్ కు వెళ్తారు. మరికొంత మంది లేజర్ ట్రీట్ మెంట్స్ తీసుకుంటూంటారు. అయితే చాలా మంది వాటిని కట్ చేయడం, గిల్లడం వంటివి చేస్తూ ఉంటారు. కాని పులిపిర్లను అలా అస్సలు చేయకూడదని చర్మ నిపుణులు సూచిస్తున్నారు. రెండింటి కన్నా ఎక్కువ ఉన్నవారు ఈ చిట్కాలను ట్రై చేస్తే.. పులిపిర్లు ఎలాంటి నొప్పి, మంట లేకుండా వాటంతట అవే రాలిపోతాయ్. ఈ పులిపిర్లను కాఫి పొడితో చెక్ పెట్టవచ్చు.

*ఒక గిన్నెలో ఆర్గానిక్ పసుపు, వంటసోడా, సున్నం సమపాళ్లలో తీసుకుని.. అందులో నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమంలోనే కాఫీ పొడిని కూడా వేసి మరోసారి కలుపుకుని పులిపిర్లు ఉన్న చర్మంపై కాటన్ తో రాయాలి. బాగా ఆరిన తర్వాత మరోసారి రాయాలి. ఇలా 5-6 సార్లు రాయాలి. ఇలా చేస్తే.. పులి పిర్లు త్వరగా రాలిపోతాయి.

ఇవి కూడా చదవండి

మరో చిట్కా ఏంటంటే.. 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని వాటి నుంచి రసాన్ని తీసుకోవాలి. దానికి కొద్దిగా నిమ్మరసం, వంటసోడా, సున్నం, కొంచెం కాఫీ పౌడర్ కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని పులిపిర్లపై 5-6 సార్లు రాస్తే ఒక్క రోజులోనే రాలి పోతాయి. పెద్దవిగా ఉన్నవైతే 2 లేదా మూడు రోజుల్లో రాలిపోతాయి. వెల్లుల్లి, సున్నంలో ఉండే ఘాటు వలన వీటి నుంచి త్వరగా విముక్తి పొందవచ్చు. ఈ ఇంటి చిట్కాల ద్వారా పులిపిర్లు ఎక్కువగా ఉన్నవారు ఆ సమస్య నుంచి బయటపడొచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్రప్రదేశ్‌కు ఎంత అప్పు ఉందో అసెంబ్లీలో వెల్లడించిన చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్‌కు ఎంత అప్పు ఉందో అసెంబ్లీలో వెల్లడించిన చంద్రబాబు..
వామ్మో పులి.! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో..
వామ్మో పులి.! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో..
ఆదివాసీ, గిరిజనులతో ప్రధాని బంధం విడదీయలేనిది.. !
ఆదివాసీ, గిరిజనులతో ప్రధాని బంధం విడదీయలేనిది.. !
మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!