Health Benefits of Mulethi or Licorice: ఎన్నో అనారోగ్య సహస్యలకు చెక్ పెట్టే అతిమధురం వేర్లు!!

ఆయుర్వేదంలో వాడే వేర్లలో.. అతిమధురం వేర్లు కూడా ఒకటి. అనేక ఆయుర్వేద మందుల తయారీలో దీనిని విరివిగా ఉపయోగిస్తారు. అతిమధురం వేరుతో అనేకరకాల అనారోగ్య సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. అతిమధురం వేర్లు శాస్త్రీయ నామం గ్లైసరీసా గాబ్రా. ఈ మొక్క 1.5 మీటర్ల ఎత్తువరకూ పెరుగుతుంది. తియ్యగా ఉంటుంది కాబట్టి దీనికి అతిమధురం అని పేరు. ఈ వేర్లను ఉపయోగించి దగ్గును తగ్గించుకోవచ్చు. అలాగే చర్మ సౌందర్యానికి, కడుపులో పుండ్లను తగ్గించుకునేందుకు..

Health Benefits of Mulethi or Licorice: ఎన్నో అనారోగ్య సహస్యలకు చెక్ పెట్టే అతిమధురం వేర్లు!!
Health Benefits of Mulethi or Licorice
Follow us

|

Updated on: Aug 14, 2023 | 2:42 PM

ఆయుర్వేదంలో వాడే వేర్లలో.. అతిమధురం వేర్లు కూడా ఒకటి. అనేక ఆయుర్వేద మందుల తయారీలో దీనిని విరివిగా ఉపయోగిస్తారు. అతిమధురం వేరుతో అనేకరకాల అనారోగ్య సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. అతిమధురం వేర్లు శాస్త్రీయ నామం గ్లైసరీసా గాబ్రా. ఈ మొక్క 1.5 మీటర్ల ఎత్తువరకూ పెరుగుతుంది. తియ్యగా ఉంటుంది కాబట్టి దీనికి అతిమధురం అని పేరు. ఈ వేర్లను ఉపయోగించి దగ్గును తగ్గించుకోవచ్చు. అలాగే చర్మ సౌందర్యానికి, కడుపులో పుండ్లను తగ్గించుకునేందుకు కూడా వాడుతారు. ఇంకా అతిమధురంను ఎలా వాడితే ఎలాంటి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం.

కడుపులో పుండ్లు మాయం: ఒకటి లేదా రెండు గ్రాముల మోతాదులో అతిమధురం చూర్ణాన్ని పాలు లేదా తేనెతో కలిపి తీసుకుంటే.. కడుపులో పుండ్లు తగ్గుతాయి.

అల్సర్ తగ్గుతుంది: అతిమధురం వేర్లతో హైపర్ ఎసిడిటీ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అర టీ స్పూన్ మోతాదులో పొడిని నీటిలో వేసి కలుపుకని తాగితే అల్సర్ సమస్య తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

గొంతు సమస్యలు: ఒక చిటికెడు అతిమధురం చూర్ణాన్ని తేనెలో కలిపి తింటే దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి.

గాయాలు నయం అవుతాయి: అతిమధురం వేరు చూర్ణాన్ని వెన్న లేదా తేనె లేదా నెయ్యితో కలిపి కాలిన గాయాలపై రాస్తే.. అవి త్వరగా తగ్గుతాయి.

మలబద్ధకం సమస్య తగ్గుతుంది: రెండు గ్రాముల అతిమధురం వేరుపొడిని 3-5 గ్రాముల బెల్లంతో కలిపి ఉండలాగా చేసుకుని తింటే.. మలబద్ధకం సమస్య తగ్గుతుంది. ఈ సమస్య నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది.

నోటిపూత మాయం: అతిమధురం వేరు చూర్ణం అర టీ స్పూన్ మోతాదులో తీసుకుని.. ఒక గ్లాసు నీటిని గిన్నెలో పోసి అందులో కలపాలి. ఈ నీరు అర గ్లాసు అయ్యేంతవరకూ మరిగించాలి. ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని గోరువెచ్చగా ఉండగా తాగితే కీళ్లనొప్పులు తగ్గుతాయి. ఇదే కషాయాన్ని నోటిలో పోసుకుని పుక్కిలించితే నోటిపూత తగ్గుతుంది.

జుట్టు రాలదు: అతిమధురం వేర్లను పాలు, కుంకుమపువ్వుతో కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి.. రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే కుంకుడుకాయ లేదా హెర్బల్ షాంపూతో తలంటుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టురాలడం, చుండ్రు సమస్యలు తగ్గి జుట్టు ఒత్తుగా కూడా పెరుగుతుంది.

అంతేకాకుండా మూత్రపిండాల సమస్య, రక్తపోటు (Blood Pressure), షుగర్ వంటి సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు అతిమధురం వేర్ల చూర్ణాన్ని వాడితే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కొత్త ఫోన్‌ కొనే వారికి కరెక్ట్ టైమ్‌.. అమెజాన్‌ సేల్‌లో
కొత్త ఫోన్‌ కొనే వారికి కరెక్ట్ టైమ్‌.. అమెజాన్‌ సేల్‌లో
ఉన్నోళ్లు.. వస్తున్నోళ్లు.. రాబోయే వాళ్లు.. అందరిది గ్లామర్ దారే
ఉన్నోళ్లు.. వస్తున్నోళ్లు.. రాబోయే వాళ్లు.. అందరిది గ్లామర్ దారే
తెలంగాణకు వెదర్ డిపార్ట్‌మెంట్ అలెర్ట్.. 3 రోజులు భారీ వర్షాలు
తెలంగాణకు వెదర్ డిపార్ట్‌మెంట్ అలెర్ట్.. 3 రోజులు భారీ వర్షాలు
సంపత్ వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం.. భారీగా భక్తుల రద్దీ
సంపత్ వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం.. భారీగా భక్తుల రద్దీ
మోక్షజ్ఞ పూర్తి పేరెంటో తెలుసా? తాతయ్య పేరు వచ్చేలా భలే ఉందిగా..
మోక్షజ్ఞ పూర్తి పేరెంటో తెలుసా? తాతయ్య పేరు వచ్చేలా భలే ఉందిగా..
సగటున ఒక వ్యక్తికి రోజుకు ఎన్ని ఫేక్ కాల్స్‌ వస్తున్నాయో తెలుసా.?
సగటున ఒక వ్యక్తికి రోజుకు ఎన్ని ఫేక్ కాల్స్‌ వస్తున్నాయో తెలుసా.?
హిందూ సోదరులకు మట్టి వినాయకులను పంపిణీ చేసిన ముస్లిం యువకుడు..
హిందూ సోదరులకు మట్టి వినాయకులను పంపిణీ చేసిన ముస్లిం యువకుడు..
ఇటు పర్సనల్.. అటు ప్రొఫెషనల్.. తారక్ మార్క్ సెట్.!
ఇటు పర్సనల్.. అటు ప్రొఫెషనల్.. తారక్ మార్క్ సెట్.!
ఆ ట్రెండ్ సీనియర్ దర్శకులకి హెల్ప్ అవుతుందా.. మళ్లీ ఫారంలోకి.?
ఆ ట్రెండ్ సీనియర్ దర్శకులకి హెల్ప్ అవుతుందా.. మళ్లీ ఫారంలోకి.?
తప్పుడు ఆరోపణలు.. విచారణ జరగాల్సిందే.. 'ప్రేమమ్' హీరో..
తప్పుడు ఆరోపణలు.. విచారణ జరగాల్సిందే.. 'ప్రేమమ్' హీరో..
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు
ఊడ్చే ఉద్యోగానికి 40 వేల మంది గ్రాడ్యుయేట్లు, 6 వేల మంది పోటీ.!
ఊడ్చే ఉద్యోగానికి 40 వేల మంది గ్రాడ్యుయేట్లు, 6 వేల మంది పోటీ.!
వరద సహాయక చర్యల్లో ఫెయిల్, 30 మందికి మరణశిక్ష.! కిమ్ పాలన ఇంతే.!
వరద సహాయక చర్యల్లో ఫెయిల్, 30 మందికి మరణశిక్ష.! కిమ్ పాలన ఇంతే.!