Vitamin B12 Deficiency: ఈ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా.. వీటిని తింటే సరి!!

ఒక మనిషి ఆరోగ్యంగా జీవించేందుకు అవసరమయ్యే విటమిన్లలో విటమిన్ B12 కూడా ఒకటి. ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని చక్కగా ఉంచడంలో విటమిన్ B12 ముఖ్యపాత్ర పోషిస్తుంది. విటమిన్ B12 శరీరంలో నాడీమండల వ్యవస్థ పనితీరును మెరుగుపరచడం, ఎర్రరక్త కణాల తయారీలో ముఖ్యపాత్ర పోషించడం వంటి వాటిలో సహాయపడుతుంది. ప్రస్తుత కాలంలో చాలామంది విటమిన్ B12 లోపంతో బాధపడుతున్నారు. శరీరంలో విటమిన్ B12 లోపించడం వల్ల నీరసం..

Vitamin B12 Deficiency: ఈ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా.. వీటిని తింటే సరి!!
Vitamin B12 Deficiency
Follow us
Chinni Enni

|

Updated on: Aug 14, 2023 | 12:53 PM

ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో 75 శాతం మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు. కడుపు నిండుతుంది అనుకుంటున్నారు కానీ.. ఏం తింటున్నారో.. దీని వల్ల శరీరానికి ఎలాంటి ఉపయోగం ఉందనే విషయం మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించకపోవడం కారణంగానే చాలా సమస్యలు తలెత్తుతున్నాయి. గతంలో కంటే ఇప్పుడున్న జీవన ప్రమాణం ప్రకారం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లేదంటే సమస్యలను ఎదుర్కొనవల్సిందే. అందులోనూ శరీరంలో విటమిన్లు ముఖ్య పాత్ర వహిస్తాయి.

ఒక మనిషి ఆరోగ్యంగా జీవించేందుకు అవసరమయ్యే విటమిన్లలో విటమిన్ B12 కూడా ఒకటి. ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని చక్కగా ఉంచడంలో విటమిన్ B12 ముఖ్యపాత్ర పోషిస్తుంది. విటమిన్ B12 శరీరంలో నాడీమండల వ్యవస్థ పనితీరును మెరుగుపరచడం, ఎర్రరక్త కణాల తయారీలో ముఖ్యపాత్ర పోషించడం వంటి వాటిలో సహాయపడుతుంది. ప్రస్తుత కాలంలో చాలామంది విటమిన్ B12 లోపంతో బాధపడుతున్నారు. శరీరంలో విటమిన్ B12 లోపించడం వల్ల నీరసం, తల తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావటం వంటి లక్షణాలతో పాటు.. రక్తహీనత, తలనొప్పి, ఆందోళన, జ్ఞాపకశక్తి తగ్గడం, కాళ్లు, చేతుల్లో మంటలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. జీర్ణసంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయి.

విటమిన్ B12 లోపాన్ని ఇలా అధిగమించండి..

ఇవి కూడా చదవండి

విటమిన్ B12 లోపంతో బాధపడుతున్నవారు వైద్యుల సలహా మేరకు సప్లిమెంట్స్ ను వాడుతుంటారు. వాటితో పాటు.. కొన్ని ఆహారాలను తినడం ద్వారా కూడా విటమిన్ B12 లోపాన్ని అధిగమించవచ్చు. మాంసాహారం, ఓట్స్, సోయాబీన్స్ వంటి వాటిని తినడం వల్ల కూడా విటమిన్ B12 శరీరానికి అందుతుంది. అలాగే వర్షాకాలంలో ఎక్కువగా దొరికే పుట్టగొడుగులు కూడా తినొచ్చు. బ్రోకలీ, పాలు, పెరుగులలో కూడా విటమిన్ B12 లభిస్తుంది.

మాంసాహారాన్ని తినలేని వారు.. పుట్టగొడుగులను తినడం ద్వారా ఆ లోపాన్ని సరిచేసుకోవచ్చు. పైన పేర్కొన్న లక్షణాలు మీలో ఉంటే.. మీ శరీరంలో విటమిన్ B12 లోపం ఉందని గమనించాలి. వెంటనే మీ ఆహారపు అలవాట్లను మార్చుకుంటే.. సమస్య ఎక్కువకాకముందే పరిష్కరించుకోవచ్చు. శరీరానికి కావలసిన మోతాదులో విటమిన్ B12 అందేలా ఆహారాలను తీసుకుంటే శారీరక ఆరోగ్యంతో పాటు.. మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి