AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Hacks: వంటింట్లో ఉండే దాల్చిన చెక్కతోటే దగ్గు, ఆస్తమాకు బైబై చెప్పండి!!

మనిషిని పట్టి పీడించే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల్లో దగ్గు, ఆస్తమా కూడా ఉన్నాయి. దగ్గు అదేపనిగా వస్తే దానిని కోరింత దగ్గు అంటారు. కొన్నిసందర్భాల్లో దగ్గు కారణంగా ప్రాణాలు కోల్పోయినవారు కూడా ఉన్నారు. అలాగే ఆస్తమా కూడా ప్రాణానికి డేంజరే. ఆస్తమా రోగులు ఏ మాత్రం తమ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేసినా.. అది ప్రాణానికే ప్రమాదం కావొచ్చు. వర్షాకాలం, శీతాకాల్లో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. శీతల పానీయాలకు చాలా దూరంగా ఉండాలి. ఈ రెండింటినీ తగ్గించే ఓ చక్కని చిట్కా..

Kitchen Hacks: వంటింట్లో ఉండే దాల్చిన చెక్కతోటే దగ్గు, ఆస్తమాకు బైబై చెప్పండి!!
Cinnamon
Chinni Enni
|

Updated on: Aug 12, 2023 | 10:40 PM

Share

మనిషిని పట్టి పీడించే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల్లో దగ్గు, ఆస్తమా కూడా ఉన్నాయి. దగ్గు అదేపనిగా వస్తే దానిని కోరింత దగ్గు అంటారు. కొన్నిసందర్భాల్లో దగ్గు కారణంగా ప్రాణాలు కోల్పోయినవారు కూడా ఉన్నారు. అలాగే ఆస్తమా కూడా ప్రాణానికి డేంజరే. ఆస్తమా రోగులు ఏ మాత్రం తమ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేసినా.. అది ప్రాణానికే ప్రమాదం కావొచ్చు. వర్షాకాలం, శీతాకాల్లో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. శీతల పానీయాలకు చాలా దూరంగా ఉండాలి. ఈ రెండింటినీ తగ్గించే ఓ చక్కని చిట్కా.. మన వంటింట్లో ఉండే దాల్చిన చెక్క. దీంతో ఓ టీ తయారు చేసుకుని దగ్గు, ఆస్తమా సమస్యల్ని తగ్గించుకోవచ్చు. మరి ఆ టీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

దాల్చిన చెక్క టీ తయారీ కోసం.. దాల్చిన చెక్కపొడి, మెంతులు, లవంగాలు, యాలకులు, తులసి ఆకులు, పసుపు, 2 గ్లాసుల నీరు తీసుకోవాలి.

ఒక గిన్నెలో 2 గ్లాసుల నీటిని పోసి వేడి చేయాలి. అందులో 1 టీ స్పూన్ మెంతులు, అర టీ స్పూన్ దాల్చినచెక్క పొడి, 4 లంవగాలు, 2 యాలకులు, 6 తులసి ఆకులు, 1 టీ స్పూన్ పసుపు వేసి.. ఒక గ్లాసు నీరు అయ్యేంతవరకూ మరిగించాలి. ఇలా మరిగిన టీ ని ఒక గ్లాసులోకి వడగట్టుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఈ టీ ని ప్రతిరోజూ ఉదయం గోరు వెచ్చగా తాగాలి. ఈ టీ తాగడానికి అరగంట ముందు.. తాగిన అరగంట తర్వాత ఎలాంటి ఆహారాన్ని తినకూడదు. ఇతర డ్రింక్స్ ఏవీ తాగకూడదు. ఇలా క్రమం తప్పకుండా తాగితే దగ్గు తగ్గుతుంది. ఆస్తమా కూడా కంట్రోల్ అవుతుంది. అలాగే షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. జీర్ణశక్తి మెరుగవుతుంది.

అజీర్తి, మలబద్ధకం సమస్యలు కూడా తగ్గుతాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కరిగి అధిక బరువు తగ్గుతారు. ఈ టీ తయారీకి వాడినవన్నీ సహజసిద్ధమైనవే కాబట్టి ఎలాంటి హాని ఉండదు. అన్నీ వంటింట్లో ఉండే పదార్థాలే కాబట్టి పెద్దగా ఖర్చుకూడా అవ్వదు. ఇన్నిరకాల ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ టీ ని మీరూ ఇక నుంచి ట్రై చేయండి. ఆరోగ్యంగా ఉండండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

త్వరలోనే భారత్‌ - ఫ్రాన్స్‌ మధ్య బిగ్ డిఫెన్స్‌ డీల్‌..!
త్వరలోనే భారత్‌ - ఫ్రాన్స్‌ మధ్య బిగ్ డిఫెన్స్‌ డీల్‌..!
స్టార్ ప్లేయర్‌ను ఇంటికి పంపేసిన యూఏఈ.. కారణం IND, PAK సమస్యేనా?
స్టార్ ప్లేయర్‌ను ఇంటికి పంపేసిన యూఏఈ.. కారణం IND, PAK సమస్యేనా?
రైతులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఒక్క క్లిక్‌తో పొలం వద్దకే యంత్రా
రైతులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఒక్క క్లిక్‌తో పొలం వద్దకే యంత్రా
రైలులో అత్యవసర బెర్త్‌లు ఉంటాయని తెలుసా? ఎవరెవరికి ఇస్తారు?
రైలులో అత్యవసర బెర్త్‌లు ఉంటాయని తెలుసా? ఎవరెవరికి ఇస్తారు?
తొలిసారి అసెంబ్లీలో మాట్లాడుతూ.. దుమ్మురేపిన ఎమ్మెల్యే మైథిలి..!
తొలిసారి అసెంబ్లీలో మాట్లాడుతూ.. దుమ్మురేపిన ఎమ్మెల్యే మైథిలి..!
ఈ సినిమా ఉంటది భయ్యా..! చూస్తే ప్యాంట్ తడిసిపోవాల్సిదే..
ఈ సినిమా ఉంటది భయ్యా..! చూస్తే ప్యాంట్ తడిసిపోవాల్సిదే..
చాణక్యుడు చెప్పిన సీక్రెట్స్.. ఇంట్లోని శత్రువును ఓడించడం ఎలా..?
చాణక్యుడు చెప్పిన సీక్రెట్స్.. ఇంట్లోని శత్రువును ఓడించడం ఎలా..?
దొరికితే జాక్‌పాటే?.. అక్కడి నదిలో ఎక్కడ చూసిన బంగారం
దొరికితే జాక్‌పాటే?.. అక్కడి నదిలో ఎక్కడ చూసిన బంగారం
రేపట్నుంచి ఆర్‌ఆర్‌బీ రైల్వే ఆన్‌లైన్‌ పరీక్షలు..
రేపట్నుంచి ఆర్‌ఆర్‌బీ రైల్వే ఆన్‌లైన్‌ పరీక్షలు..
ఇందులో ఒక్కసారి ఇన్వెస్ట్‌ చేస్తే చాలు.. నెలనెలా రూ.6,500
ఇందులో ఒక్కసారి ఇన్వెస్ట్‌ చేస్తే చాలు.. నెలనెలా రూ.6,500