AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Independence Day: మెట్రో రైల్వే స్టేషన్‌కు బాంబు బెదిరింపు.. పోలీసుల ముమ్మర తనిఖీలు.. భయాందోళనలో ప్రయాణికులు..!

దేశ 77వ స్వాతంత్య్ర దినోత్సవానికి సన్నాహాలు జరుగుతున్న వేళ, భయంకరమైన, బెదిరింపు కాల్‌లు కూడా పెరుగుతున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలపై పాక్ ఉగ్రవాదులు దాడి చేసేందుకు కుట్ర పన్నడంతో ఢిల్లీలోని ఎర్రకోట పరిసరాల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. అదేవిధంగా ఓ మెట్రో స్టేషన్‌కు కూడా బెదిరింపు కాల్ వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేయడంతో స్టేషన్‌లోని ప్రయాణికులు కొంతసేపు భయాందోళనకు గురయ్యారని తెలిసింది. ఈ బెదిరింపు కాల్ ఎక్కడో కాదు.. దేశ రాజధాని […]

Independence Day: మెట్రో రైల్వే స్టేషన్‌కు బాంబు బెదిరింపు..  పోలీసుల ముమ్మర తనిఖీలు.. భయాందోళనలో ప్రయాణికులు..!
Metro Station
Jyothi Gadda
|

Updated on: Aug 14, 2023 | 9:37 PM

Share

దేశ 77వ స్వాతంత్య్ర దినోత్సవానికి సన్నాహాలు జరుగుతున్న వేళ, భయంకరమైన, బెదిరింపు కాల్‌లు కూడా పెరుగుతున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలపై పాక్ ఉగ్రవాదులు దాడి చేసేందుకు కుట్ర పన్నడంతో ఢిల్లీలోని ఎర్రకోట పరిసరాల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. అదేవిధంగా ఓ మెట్రో స్టేషన్‌కు కూడా బెదిరింపు కాల్ వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేయడంతో స్టేషన్‌లోని ప్రయాణికులు కొంతసేపు భయాందోళనకు గురయ్యారని తెలిసింది. ఈ బెదిరింపు కాల్ ఎక్కడో కాదు.. దేశ రాజధాని ఢిల్లీలోనే. ఢిల్లీలోని కశ్మీర్ గేట్ మెట్రో స్టేషన్‌కు ఆదివారం బాంబు బెదిరింపు కాల్ రావడంతో భద్రతా బలగాలు ఆందోళన చెందాయి. అయితే ఈ బెదిరింపు కాల్ తప్పుడు కాల్ అని తేలడంతో ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

స్వాతంత్ర్య దినోత్సవానికి రెండు రోజుల ముందు, దేశ రాజధాని అంతటా ముఖ్యంగా ఢిల్లీ మెట్రో స్టేషన్ల వంటి సున్నితమైన ప్రదేశాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలోనే ఈ సంఘటన జరిగింది. ఢిల్లీ మెట్రో కాశ్మీర్ గేట్ స్టేషన్‌లో బాంబు ఉందని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) కంట్రోల్ రూమ్‌కు సాయంత్రం ఆలస్యంగా ఫోన్‌ కాల్ వచ్చింది. మెట్రో పోలీసులు, సిఐఎస్ఎఫ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఇది రద్దీగా ఉండే స్టేషన్‌లో భయాందోళనలను సృష్టించింది. పోలీసుల తనిఖీలతో ప్రయాణికులు సైతం ఉలిక్కిపడ్డారు.

CISF బలగాలు మెట్రో స్టేషన్‌లో విస్తృతంగా వెతకగా ఎలాంటి ప్రమాదకర వస్తువులు కనిపించలేదు. బెదిరింపు కాల్ ఫేక్‌ అని తేలింది. కాశ్మీర్ గేట్ ప్రాంతంలో ఫేక్‌ కాల్‌ చేసిన వ్యక్తి కోసం పోలీసులు విస్తృతంగా గాలించారు. సీఐఎస్‌ఎఫ్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసిన వ్యక్తి… 26 ఏళ్ల రాహుల్ గా గుర్తించారు. అతడు మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. అతను ఉత్తరప్రదేశ్‌లోని జాన్‌పూర్‌కు చెందినవాడని కూడా తెలిసింది.

ఢిల్లీలోని ప్రధాన మెట్రో స్టేషన్లలో కాశ్మీర్ గేట్ మెట్రో స్టేషన్ ఒకటి. ఇది ఢిల్లీ మెట్రో నెట్‌వర్క్‌లో ప్రధాన మార్పిడి. పసుపు, ఊదా, ఎరుపు లైన్‌లకు ప్రధాన ఇంటర్‌చేంజ్‌గా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని కశ్మీర్ గేట్ మెట్రో స్టేషన్‌లో ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణికులు మెట్రో రైళ్లను మారుతుంటారు.