AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Independence Day: ఈ ఏడాది స్పెషల్ గెస్టులు వీరే.. దేశమంతా స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలకు భారీ ఏర్పాట్లు..

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈసారి రాజధాని ఢిల్లీ వేడుకలకు కొంతమంది ప్రత్యేక వ్యక్తులను ఆహ్వానించారు. ఇందులో కార్మికులు, రైతులు కాకుండా 1800 మందికి పైగా ప్రత్యేక అతిథులు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు వివిధ మెట్రో స్టేషన్లలో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సెల్ఫీ పాయింట్లను కూడా ఏర్పాటు చేశారు. 15వ తేదీన ఎర్రకోట వద్ద రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రధానికి స్వాగతం పలుకుతారు. ఢిల్లీలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. వాఘా సరిహద్దులో బీటింగ్‌ రిట్రీట్‌ కార్యక్రమాన్ని కలర్‌ఫుల్‌గా నిర్వహించారు.

Independence Day: ఈ ఏడాది స్పెషల్ గెస్టులు వీరే.. దేశమంతా స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలకు భారీ ఏర్పాట్లు..
15 August Independence Day
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 14, 2023 | 9:01 PM

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ముగింపు వేడుకలు చాలా ప్రత్యేకంగా నిలువనున్నాయి. భారతదేశం తన 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఈ ఆగస్టు 15న జరుపుకోవడానికి సిద్ధంగా ఉంది. పాఠశాల-కళాశాలల నుంచి అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు ఈ పండుగలో పాల్గొనే ఆగస్టు 15 రోజు భారతదేశ ప్రజలకు పండుగ లాంటిది. స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు దేశమంతా కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఎర్రకోటపై మంగళవారం ప్రధాని మోదీ జాతీయజెండాను ఎగురవేస్తారు. ఢిల్లీలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. వాఘా సరిహద్దులో బీటింగ్‌ రిట్రీట్‌ కార్యక్రమాన్ని కలర్‌ఫుల్‌గా నిర్వహించారు.

ఈ సందర్భం కూడా ప్రత్యేకంగా ఉండబోతోంది. మంగళవారం ఉదయం 7.30 గంటలకు ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయజెండాను ఎగురవేస్తారు. ఎందుకంటే వరుసగా పదవసారి ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.  దీంతో పాటు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రెడ్‌ఫోర్ట్‌ దగ్గర గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. టెర్రర్‌ మూకలు స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలను టార్గెట్‌ చేశాయన్న సమాచారంతో హైఅలర్ట్‌ కొనసాగుతోంది.

ఎక్కడికక్కడ భద్రతా బలగాలను మోహరించారు

సరిహద్దు ప్రాంతాల నుంచి రాజధాని ఢిల్లీ వరకు అన్ని చోట్లా భద్రతా బలగాలను మోహరించారు. ఈసారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉండబోతున్నాయి. ఎందుకంటే పీఎం-కిసాన్ లబ్ధిదారులతో సహా దేశం నలుమూలల నుంచి సుమారు 1,800 మంది ప్రత్యేక అతిథులు ఇందులో పాల్గొనేందుకు ఆహ్వానించారు.

ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు

మోదీ ప్రభుత్వం ‘ప్రజా భాగస్వామ్యం’ అనే విధానాన్ని అవలంబించింది. ఈ కార్యక్రమానికి 660కి పైగా ఆదర్శ గ్రామాలకు చెందిన సర్పంచ్‌లను ఆహ్వానించారు. దీంతో పాటు ఈ కార్యక్రమానికి 400 మందికి పైగా సర్పంచ్‌లకు ఆహ్వానం పంపారు. వీరితో పాటు సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌కు చెందిన 50 మంది శ్రమ యోగులు, 50 మంది ఖాదీ కార్మికులు, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన, పీఎం కౌశల్ వికాస్ యోజనలో 50-50 మంది భాగస్వాములు కూడా ఉన్నారు.

దేశం నలుమూలల నుంచి..

ఇది కాకుండా, రైతు ఉత్పత్తిదారు సంస్థ పథకంతో సంబంధం ఉన్న 250 మంది రైతులకు కూడా ఆహ్వానాలు పంపబడ్డాయి. ఈసారి అతిథి జాబితాలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, నర్సులు, మత్స్యకారులకు కూడా చోటు కల్పించారు. ఢిల్లీలో జరిగే వేడుకలకు హాజరయ్యే చాలా మంది అతిథులు నేషనల్ వార్ మెమోరియల్‌ను కూడా సందర్శిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అనంతరం రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్‌ భట్‌తో భేటీ కానున్నారు. ఇది మాత్రమే కాదు, దేశం నలుమూలల (రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతం) నుంచి 75 మందిని ఎంపిక చేశారు. వారు వారి సాంప్రదాయ దుస్తులలో ఉంటారు.

40 వేల మందికి పైగా..

రానున్న 25 ఏళ్లు.. అమృత్ కాల్ లక్ష్యాల గురించి వివరించే అవకాశం ఉంది. ఈ ఏడాది ఎర్రకోట వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు 30 నుంచి 40 వేల మంది హాజరవుతారని అంచనా. ప్రతి రాష్ట్రం నుంచి 80-90 జంటలను తమ రాష్ట్ర సాంప్రదాయ దుస్తుల్లో రావాల్సిందిగా ఆహ్వానించారు. మొత్తం 10 వేల మంది సిబ్బందితో నాలుగు అంచెలుగా భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఈ సారి ఆహ్వానాలు ఇలా..

విశేషమేమిటంటే, అధికారిక ఆహ్వానం ఆహ్వాన పోర్టల్ ద్వారా పంపబడింది. ఈ పోర్టల్‌లో దాదాపు 17,000 డిజిటల్ ఇన్విటేషన్ కార్డ్‌లు కూడా జారీ చేయబడ్డాయి.. దీంతో పాటు వివిధ మెట్రో స్టేషన్లలో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సెల్ఫీ పాయింట్లను కూడా ఏర్పాటు చేశారు. 15వ తేదీన ఎర్రకోట వద్ద రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రధానికి స్వాగతం పలుకుతారు. ప్రధానమంత్రి జాతీయ జెండాను ఎగురవేసిన వెంటనే.. భారత వైమానిక దళానికి చెందిన మార్క్-III ధ్రువ్ అనే రెండు హెలికాప్టర్లు పూల వర్షం కురిపిస్తాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం