స్వాతంత్ర సమరయోధుల గొప్పతనాన్ని చాటేలా ‘అన్నమాచార్య భావన వాహిని’ స్పెషల్ సాంగ్
అన్నమయ్య సంకీర్తనలను విశ్వవ్యాప్తం చేసేందుకు కృషి చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు శోభారాజు. అభినవ అన్నమయ్యగా పేరుగాంచిన ఆమె శోభారాజు 1983లో ‘అన్నమాచార్య భావనా వాహిని’ స్థాపించారు. దీని ద్వారా ఎంతో మంది యువతి, యువకులకు సంగీత, సాహిత్య రంగాల్లో ప్రావీణ్యులుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా 'ఆజాదీకా అమృత్ మహోత్సవ్"లో భాగంగా ఈ సంస్థ ఓ పాటను ఆలపించారు. 'అన్నమాచార్య భావనా వాహిని' విభాగం సమరయోధుల గొప్పతనాన్ని వివరిస్తూ ఆలపించిన ఓ చక్కని వీడియోను..
అన్నమయ్య సంకీర్తనలను విశ్వవ్యాప్తం చేసేందుకు కృషి చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు శోభారాజు. అభినవ అన్నమయ్యగా పేరుగాంచిన ఆమె శోభారాజు 1983లో ‘అన్నమాచార్య భావనా వాహిని’ స్థాపించారు. దీని ద్వారా ఎంతో మంది యువతి, యువకులకు సంగీత, సాహిత్య రంగాల్లో ప్రావీణ్యులుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్”లో భాగంగా ఈ సంస్థ ఓ పాటను ఆలపించారు. ‘అన్నమాచార్య భావనా వాహిని’ విభాగం సమరయోధుల గొప్పతనాన్ని వివరిస్తూ ఆలపించిన ఓ చక్కని వీడియోను విడుదల చేశారు. దేశ భక్తి ప్రబోధించే ఈ పాటకు పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ శోభా రాజు, తన పదమూడవ ఏట సంగీతం సమకూర్చారు. ప్రఖ్యాత గాయకుడు, సాందీప్, రన్విత, పద్మశ్రీ, రమణతో పాటు అన్నమాచార్య భావన వాహినికి చెందిన విద్యార్థినీ, విద్యార్థులు పాటను ఆలపించారు. ప్రఖ్యాత కెమెరా మెన్, దర్శకుడు మీర్ ఈ పాటకు వీడియో రూపకల్పన చేశారు.