AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రియుడితో కలిసి ఉండటానికి భర్త అడ్డు తొలగించేందుకు ప్లాన్ వేసిన భార్య.. చివరికి

ఆ దంపతులు పెళ్లి చేసుకుని ఆనందంగా ఉన్నారు. రెండేళ్ల పాటు భర్తతో సంతోషంగా గడిపిన భార్య మరో ప్రియుడ్ని సెట్ చేసుకుని అతనితో ఎంజాయ్ చేసింది. చివరికి భర్తకు ఈ విషయం తెలియడంతో భార్యపై తన కోపాన్ని చూపించాడు. ఇక తన ప్రియుడితో ఆనందంగా గడిపేందుకు భర్త అడ్డుపడుతున్నాడని అతన్ని చంపేందుకు భార్య ప్లాన్ వేసి హత్య చేసింది. ఈ ఘటన కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా కడూరు తాలుకాలోని యాగటి సమీపంలో హనుమన హళ్లి అనే గ్రామంలో జరిగింది.

ప్రియుడితో కలిసి ఉండటానికి భర్త అడ్డు తొలగించేందుకు ప్లాన్ వేసిన భార్య.. చివరికి
Wife And Husband
Aravind B
|

Updated on: Aug 15, 2023 | 5:57 AM

Share

ఆ దంపతులు పెళ్లి చేసుకుని ఆనందంగా ఉన్నారు. రెండేళ్ల పాటు భర్తతో సంతోషంగా గడిపిన భార్య మరో ప్రియుడ్ని సెట్ చేసుకుని అతనితో ఎంజాయ్ చేసింది. చివరికి భర్తకు ఈ విషయం తెలియడంతో భార్యపై తన కోపాన్ని చూపించాడు. ఇక తన ప్రియుడితో ఆనందంగా గడిపేందుకు భర్త అడ్డుపడుతున్నాడని అతన్ని చంపేందుకు భార్య ప్లాన్ వేసి హత్య చేసింది. ఈ ఘటన కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా కడూరు తాలుకాలోని యాగటి సమీపంలో హనుమన హళ్లి అనే గ్రామంలో జరిగింది. నవీన్ అనే 28 ఏళ్ల యువకుడు తన భార్య చేతిలో హత్యకు గురవ్వడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే ఆరు సంవత్సరాల క్రితం నవీన్‌కు పావని అనే యువతితో పెళ్లి జరిగింది. ఈ దంపతులకు 4 ఏళ్ల కూతురు కూడా సఉంది. వివాహం జరిగిన రెండేళ్ల దాకా భార్యభర్తలు ఆనందంగానే గడిపారు. కానీ ఆ తర్వాత నవీన్, పావనీల మధ్య గొడవలు జరగడం మొదలయ్యాయి. చివరికి గ్రామ పెద్దలు, కుటుంబీకులు జోక్యం చేసుకొని ఆ దంపతుల మధ్య పంచాయతీలు కూడా చేసేశారు. అయితే మరో విషయం ఏంటంటే అప్పటికే పావనికి కిరణ్ అనే మరో యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న పావని అతనితో ఎంజాయ్ చేస్తూ రోజులు గడిపింది.

ఇక భర్త నవీన్‌కు ఈ విషయం తెలియడంతో ఆమెను కిరణ్ వద్దకు వెళ్లేందుకు అంగీకరించలేదు. దీంతో పావన్ తన భర్తను హత్య చేయాలని భావించింది. నీ భర్తను హత్య చేస్తే మనం జీవితాంతం కలిసి ఉందామని కిరణ్ ఆమెను చెప్పాడు. గత కొంతకాలం నుంచి నవీన్‌ను హత్య చేసేందుకు భార్య పావని, ఆమె ప్రియుడు కిరణ్ ప్లాన్ వేస్తూనే ఉన్నారు. చివరికి పావని ఓ కొత్త స్కెచ్ వేసింది. చపాతీలు చేసేందుకు ఉపయోగించే నీళ్లలో నిద్రమాత్రను కలిపిన పావని.. ఆ మాత్రలు పూర్తిగా కరిగిపోయేటట్లు చేసింది. నిద్రమాత్రలు కలిపిన ఆ నీళ్లలో చపాతీ పిండిని కలిపేసి చపాతి చేసింది. ఈ తర్వాత భర్త నవీన్‌తో తినిపించింది. ఇక నవీన్ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆగస్టు 5న ప్రియుడు కిరణ్‌తో కలిసి దగ్గర్లోని ఓ చెరువు వద్దకు తీసుకెళ్లీ నవీన్‌ను అందులో విసిరేశారు. నవీన్ ఆత్మహత్య చేసుకున్నాడని అందరిని నమ్మించాలని అతని చెప్పులు, సెల్‌ఫోన్‌తో సహా అతనికి చెందిన వస్తువులు ఒడ్డున అక్కడక్కడ పారేశారు. ఇక ఆదివారం మధ్యాహ్నం నవీన్ మృతదేహం చెరువులో కనబడింది.

అయితే నవీన్ కుటుంబ సభ్యులు అతని మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. నవీన్‌కు ఎలాంటి అప్పులు, ఆర్థిక సమస్యలు లేవని..ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదంటూ పోలీసులను ఆశ్రయించారు. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు నవీన్ మృతదేహానికి కడూరు తాలుకా హాస్పిటల్‌లో పోస్టుమార్టం చేయకుండా చిక్కమగళూరు జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇక చివరికి పోస్టు మార్టం రిపోర్టు వచ్చిన తర్వాత ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు పావనీ ఒప్పుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం

వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి