Telangana Politics: సనత్ నగర్‌లో తండ్రి కొడుకుల పొలిటికల్ యుద్ధం.. ఎవరు ఎవరితోనో తెలుసా..
గతంలో కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉండి రేవంత్ రెడ్డిపై తీవ్ర అసంతృప్తి తో బీజేపీ లో చేరిన మాజీ నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ మాజీ వైస్ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి గతంలో కాంగ్రెస్ తరపున సనత్‌నగర్ నియోజకవర్గం నుండి అనేక సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు అయిన బీజేపీలో చేరడంతో ఆ సీట్ మర్రికి వస్తుందని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి.. అయితే ఆయన కుమారుడు మర్రి ఆదిత్యరెడ్డి మాత్రం కాంగ్రెస్‌లో కొనసాగుతూ సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి పోటీ..
హైదరాబాద్, ఆగస్టు 14: రాజకీయాల్లో బంధువులు ఒకరి పై ఒకరు పోటీ చేసుకోవడం కొత్త విషయం కాదు కానీ తండ్రి కొడుకులు కొట్టుకోవడం ఇప్పటి వరకు పెద్దగా చూడలేదు.. అలాంటిది తండ్రీ కొడుకులు తలపడే అవకాశం ఉండడం తో ఇప్పుడు సనత్‌నగర్ నియోజకవర్గం పై అందరి దృష్టి పడ్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సీట్ లో ప్రముఖ పార్టీల నుండి పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లు పై ఆకస్తి నెలకొంది.
గతంలో కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉండి రేవంత్ రెడ్డిపై తీవ్ర అసంతృప్తి తో బీజేపీ లో చేరిన మాజీ నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ మాజీ వైస్ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి గతంలో కాంగ్రెస్ తరపున సనత్‌నగర్ నియోజకవర్గం నుండి అనేక సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు అయిన బీజేపీలో చేరడంతో ఆ సీట్ మర్రికి వస్తుందని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి.. అయితే ఆయన కుమారుడు మర్రి ఆదిత్యరెడ్డి మాత్రం కాంగ్రెస్‌లో కొనసాగుతూ సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు.
సీనియారిటీ, నియోజకవర్గంలో ఆయనకున్న ఫాలోయింగ్‌ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర బీజేపీ సనత్‌నగర్ నుంచి శశిధర్‌రెడ్డిని పోటీకి దింపనుంది. ఇదిలా ఉంటే ఆదిత్య రెడ్డి కూడా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే గత వారం బేగంపేటలో కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు మర్రి ఆదిత్య రెడ్డి.
బిజెపి ప్రజల మధ్య మత విభేదాలను ప్రేరేపిస్తోందని, కాషాయ పార్టీకి ఓటర్లు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపనిచ్చారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అయతే అయిన ఇప్పటి వరకు సనత్ నగర్ లో పెద్దగా దృష్టి పెట్టలేదు.. ఇప్పుడు సడెన్ గ ఇక్కడ దృష్టి పెట్టడం తో రాజకీయం ఆసక్తిగా మారింది.
మర్రి శశిధర్ రెడ్డి సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు గెలుపొందగా, ఆదిత్యరెడ్డి 2018 ఎన్నికల్లో తాండూరు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.తండ్రీకొడుకుల పోటీ నేపథ్యంలో సనత్ నగర్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఇక్కడా brs నుండి మంత్రి తలసాని ఉండడం.. కాంగ్రెస్ vs బీజేపీ లో తండ్రి కొడుకులు ఉండడంతో ఇప్పుడు సనత్ నగర్ పై రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కోట నీలిమ కూడా సనత్‌నగర్ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కాంగ్రెస్ తనకు టికెట్ ఇస్తుందని పేర్కొంటూ గత వారం మాజీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కూన వెంకటేష్ గౌడ్ ను ఆయన నివాసంలో కలిసిన మద్దతు కోరారు. వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు మద్దతు ఇవ్వాలని కోరారు.ఈ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేయనప్పటికీ, ఆదిత్యరెడ్డి , నీలిమ ఇద్దరూ తమ ప్రచారాన్ని ప్రారంభించేందుకు ఇప్పటికే చర్యలు ప్రారంభించారు.
టికెట్ ఆదిత్య కి వస్తే సనత్ నగర్ నియోజకవర్గంలో తండ్రి కొడుకుల పోరు తప్పదనే చర్చ జోరుగా సాగుతోంది..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం