TSPSC Group 3 Edit Option 2023: తెలంగాణ గ్రూప్-3 దరఖాస్తుల్లో సవరణలకు అవకాశం.. చివరి తేదీ ఇదే
తెలంగాణలో మొత్తం1388 గ్రూప్ సర్వీసు ఉద్యోగాలకు గతేడాది డిసెంబర్‌లో టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 26 ప్రభుత్వ విభాగాల్లో మొత్తం 1,363 పోస్టుల భర్తీకి డిసెంబరు 30న కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ తర్వాత ఈ పోస్టులకు బీసీ గురుకుల సొసైటీలో ఖాళీగా ఉన్న 12 పోస్టులు అదనంగా చేర్చింది. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 1,375కి పెరిగింది. నీటిపారుదలశాఖ ఈఎన్‌సీ కార్యాలయంలో 13 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం వాటిని..
హైదరాబాద్, ఆగస్టు 14: తెలంగాణలో గ్రూప్-3 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు ముఖ్య గమనిక. గ్రూప్-3 పరీక్ష దరఖాస్తుల్లో సవరణలకు టీఎస్‌పీఎస్సీ అవకాశం కల్పించింది. ఆగస్టు 16వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులలో మార్పులు చేర్పులకు అవకాశం కల్పించింది. ఈ మేరకు ఎడిట్ ఆప్షన్ ఇస్తూ ప్రకటన వెలువరించింది. గ్రూప్ 3 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నవారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవల్సిందిగా కమిషన్ సూచించింది.
కాగా తెలంగాణలో మొత్తం1388 గ్రూప్ సర్వీసు ఉద్యోగాలకు గతేడాది డిసెంబర్‌లో టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 26 ప్రభుత్వ విభాగాల్లో మొత్తం 1,363 పోస్టుల భర్తీకి డిసెంబరు 30న కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ తర్వాత ఈ పోస్టులకు బీసీ గురుకుల సొసైటీలో ఖాళీగా ఉన్న 12 పోస్టులు అదనంగా చేర్చింది. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 1,375కి పెరిగింది. నీటిపారుదలశాఖ ఈఎన్‌సీ కార్యాలయంలో 13 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం వాటిని కూడా గ్రూప్ 3 పోస్టులకు కలిపింది. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 1,388కి చేరింది.
ఇక గ్రూప్ 3 సర్వీస్ పోస్టులకు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 5,36,477 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇది తెలంగాణ తొలి గ్రూప్-3 నియామక నోటిఫికేషన్ కావడం గమనార్హం. గ్రూప్ 3 పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. మొత్తం మూడు పేపర్లకు పరీక్ష ఉంటుంది. మూడు పేపర్లకు గానూ 450 మార్కులకు గ్రూప్ 3 రాత పరీక్ష నిర్వహిస్తారు. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో పరీక్ష ప్రశ్నా పత్రం ఉంటుంది. అన్ని జిల్లా కేంద్రాల్లో గ్రూప్ 3 పరీక్ష నిర్వహించనున్నట్లు కమిషన్ ఇప్పటికే ప్రకటించింది కూడా.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.