AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Instagram: ఇన్‌స్టాలో ఎక్కువ ఫాలోవర్స్‌ ఉన్నారని భార్యపై ఈర్ష్య.. కన్న బిడ్డల ఎదుటే భార్యను హతమార్చిన భర్త..

ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలోని పారా ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ వ్యాపారవేత్త (37)కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తెకు 12 ఏళ్లు, కుమారుడికి ఐదేళ్లు ఉన్నాయి. టూర్ అండ్‌ ట్రావెల్ ఏజెన్సీని బిజినెస్‌ చేస్తున్నాడు. గృహిణి అయిన అతని భార్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ మంది ఫాలోవర్స్‌ ఉండటాన్ని అతను సహించలేకపోయాడు. అందులో తనను భార్య బ్లాక్‌ చేయడాన్ని భర్తకు మరింత కోపం తెప్పించింది. ఈ విషయమై వారి మధ్య పలుమార్లు గొడవలు సైతం జరిగాయి. భార్యకు ఎవరితోనో ఎఫైర్..

Instagram: ఇన్‌స్టాలో ఎక్కువ ఫాలోవర్స్‌ ఉన్నారని భార్యపై ఈర్ష్య.. కన్న బిడ్డల ఎదుటే భార్యను హతమార్చిన భర్త..
Man Killed His Wife
Srilakshmi C
|

Updated on: Aug 14, 2023 | 2:50 PM

Share

లక్నో, ఆగస్టు 14: భార్య ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్‌ అధికంగా ఉన్నారని భర్త అసూయపడ్డాడు. దీంతో భార్య భర్త అకౌంట్ ను ప్రైవేట్ లో పెట్టింది. దీంతో ఆమెపై అనుమానం పెంచుకున్న భర్త కాపురాన్ని గుల్లచేశాడు. కన్నబిడ్డల ఎదుటే భార్యను అతిదారుణంగా హతమార్చాడు. ఉత్తరప్రదేశ్‌లో ఈ దారుణం ఆదివారం (ఆగస్టు 13) ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలోని పారా ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ వ్యాపారవేత్త (37)కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తెకు 12 ఏళ్లు, కుమారుడికి ఐదేళ్లు ఉన్నాయి. టూర్ అండ్‌ ట్రావెల్ ఏజెన్సీని బిజినెస్‌ చేస్తున్నాడు. గృహిణి అయిన అతని భార్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ మంది ఫాలోవర్స్‌ ఉండటాన్ని అతను సహించలేకపోయాడు. అందులో తనను భార్య బ్లాక్‌ చేయడాన్ని భర్తకు మరింత కోపం తెప్పించింది. ఈ విషయమై వారి మధ్య పలుమార్లు గొడవలు సైతం జరిగాయి. భార్యకు ఎవరితోనో ఎఫైర్ ఉందని అనుమానం పెట్టుకున్నాడు.

నాన్నే అమ్మను చంపాడు..!

ఆదివారం పిల్లలు, భార్యతో కలిసి కారులో రాయ్‌బరేలీకి బయల్దేరారు. మార్గం మధ్యలో సుల్తాన్‌పూర్‌లోని ముజేష్ కూడలి వద్ద కారు ఆపి భార్యతో వాగ్వాదానికి దిగాడు. దీంతో కోపంతో పిల్లల ముందే భార్యను గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత అదే వాహనంలో లాక్‌ చేసుకుని ఉండిపోయాడు. అనుమానాస్పదంగా వాహనాన్ని పార్కింగ్‌ చేయడంతో యూపీఈఐడీఏకు చెందిన పెట్రోలింగ్‌ బృందం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి వచ్చి తనిఖీ చేపట్టగా హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. తమ కళ్ల ముందే తల్లిని దారుణంగా చంపాడని కుమార్తె, కుమారుడు పోలీసులకు తెలిపారు. వారి వాంగ్మూలం ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
దసరా పండుగ ఆఫర్లు తెలిస్తే ఎవ్వరికైనా పిచ్చెక్కాల్సిందే
దసరా పండుగ ఆఫర్లు తెలిస్తే ఎవ్వరికైనా పిచ్చెక్కాల్సిందే
జుట్టు రాలిపోతుందా? ఇంట్లోనే అవిసె గింజలతో ఈ హెయిర్ మాస్క్ తయారీ
జుట్టు రాలిపోతుందా? ఇంట్లోనే అవిసె గింజలతో ఈ హెయిర్ మాస్క్ తయారీ
జేబు ఖాళీ కాదు.. బరువు పెరగరు.. సూపర్‌మార్కెట్‌కు వెళ్లేముందు..
జేబు ఖాళీ కాదు.. బరువు పెరగరు.. సూపర్‌మార్కెట్‌కు వెళ్లేముందు..
సోషల్ మీడియా నాకు నచ్చలేదు..
సోషల్ మీడియా నాకు నచ్చలేదు..
కలలో దారి తప్పిపోవడం అశుభమా? జీవితంలోని అయోమయానికి సంకేతమా?
కలలో దారి తప్పిపోవడం అశుభమా? జీవితంలోని అయోమయానికి సంకేతమా?
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..
షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..
షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..
ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!
 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..