Himachal rains: హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ను వదలని వరదలు.. ముంచెత్తిన వరద
గత 24 గంటలుగా హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో కీలకమైన సిమ్లా-చండీగఢ్ రహదారితో సహా పలు రహదారులను మూసివేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలను ఆగస్టు 14 వరకు మూసివేస్తున్నట్లు ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు ఆదివారం ఇక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాల కారణంగా పాంగ్ రిజర్వాయర్ గుండా ప్రవహించే బియాస్ నది నీటిమట్టం పెరగడంతో, భాక్రా బియాస్ మేనేజ్‌మెంట్ బోర్డు సోమవారం ఉదయం 8 గంటల నుండి పాంగ్ డ్యామ్ నుండి నీటిని విడుదల చేయాలని నిర్ణయించినట్లు కాంగ్రా డిప్యూటీ కమిషనర్ నియుపన్ జిందాల్ తెలిపారు.
హిమాచల్‌ప్రదేశ్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. అయితే వర్షాలు తగ్గినా వరద మాత్రం కొనసాగుతూనే ఉంది.జలదిగ్బంధంలోనే లోతట్టు ప్రాంతాలు..రహదారులపై భారీగా వరద పారుతుండటంతో వాహనాల రాకపోకలు కిలోమీటర్లకొద్ది ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో వరద నదీ ప్రవాహాన్ని తలపిస్తోంది.మండి , సిమ్లా, రాంపూర్ తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మండిలో భారీవర్షాల కారణంగా అపారనష్టం జరిగింది. డ్యాంలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వేల ఎకరాల్లో పంటనీట మునిగింది. మండిలో మరో నాలుగు రోజుల పాటు హిమాచల్ లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తుందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు..హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడడంతో పలు రహదారులను మూసేశారు.. ఉత్తరాఖండ్‌లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కొన్ని ఏరియాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే ఛాన్సులు ఉన్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..