- Telugu News Photo Gallery Cinema photos Bollywood Actress Sara Ali Khan's incredible weight loss journey From 96 Kgs To 55 Kgs
Sara Ali Khan: అప్పుడు 96 కిలోలు.. ఇప్పుడెమో మెరుపుతీగలా ఎంత మారిపోయింది..?
కాఫీ విత్ కరణ్ ఎపిసోడ్‌లో ఓసారి సారా మాట్లాడుతూ.. జంక్ ఫుడ్ తినడం, ముఖ్యంగా పిజ్జాలు వంటి ఆహార ఆలవాట్ల మూలంగా ఏకంగా 96 కిలోలు బరువు పెరిగినట్లు తెల్పింది. అంతేకాకుండా సారా PCOS (పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) సమస్య కూడా ఉంది. PCOS అనేది అధిక బరువు పెరగడానికి, పీరియడ్స్ సమస్యలు, గర్భధారణ సమస్యలను కలిగించే హార్మోన్ల వ్యాధి. జీవనశైలిలో చిన్నపాటి మార్పులు, ఆరోగ్యకరమైన ఆహారం, ఫిట్నెస్ ద్వారా వ్యాధిని నయం చేయవచ్చు. నటిగా తన కలను సాకారం చేసుకోవడానికి ఆమె 30 కిలోల బరువు..
Updated on: Aug 13, 2023 | 4:12 PM

సినీ పరిశ్రమలో స్టార్ల సంతానం తేలిగ్గా ఆఫర్లు దక్కించుకున్నా నిలదొక్కుకోవాలంటే మాత్రం ట్యాలెంట్ తప్పనిసరిగా ఉండాలి. ఆర్భాటంగా తెరంగెట్రం చేసి ఆతర్వాత తమను తాము నిరూపించుకోలేక కనుమరుగైపోయిన వారు ఎందరో ఉన్నారు. ఐతే బాలీవుడ్ కథానాయిక సారా అలీఖాన్ మాత్రం నేను ఆ టైప్ కాదంటోంది.

సైఫ్ అలీఖాన్, అమృతాసింగ్‌ల ముద్దుల కూతురు సారా అలీఖాన్. సినీరంగంలో తారలుగా మెరవాలంటే ఫిట్‌నెస్ చాలా ముఖ్యం అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ సారా అలీఖాన్ మాత్రం ఒకప్పుడు ఏకంగా 96 కిలోల బరువుండేది. సైఫ్ అలీఖాన్ నటి కరీనా కపూర్‌ను రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

ఆ తర్వాత పట్టుదలతో కసరత్తులు చేసి బరువు బాగా తగ్గి ప్రస్తుతం మెరుపుతీగలా మారి అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ఫిట్‌నెస్ కాపాడుకోవడం కోసం గంటల కొద్దీ జిమ్‌లో గడుపుతోంది. ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తుతూ, స్క్వాట్, ప్లాంక్ వ్యాయామాలు చేస్తూ, బరువులెత్తుతూ.. ఎంతో అంకిత భావంతో తనను తాను నిరూపించుకుంది. దీంతో బాలీవుడ్‌లో అమ్మడుని వెతుక్కుంటూ ఆఫర్లు వచ్చేస్తున్నాయి.

కాఫీ విత్ కరణ్ ఎపిసోడ్‌లో ఓసారి సారా మాట్లాడుతూ.. జంక్ ఫుడ్ తినడం, ముఖ్యంగా పిజ్జాలు వంటి ఆహార ఆలవాట్ల మూలంగా ఏకంగా 96 కిలోలు బరువు పెరిగినట్లు తెల్పింది. అంతేకాకుండా సారా PCOS (పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) సమస్య కూడా ఉంది. PCOS అనేది అధిక బరువు పెరగడానికి, పీరియడ్స్ సమస్యలు, గర్భధారణ సమస్యలను కలిగించే హార్మోన్ల వ్యాధి.

జీవనశైలి మార్పులు, ఆరోగ్యకరమైన ఆహారం, ఫిట్నెస్ ద్వారా వ్యాధిని నయం చేయవచ్చు. నటిగా తన కలను సాకారం చేసుకోవడానికి ఆమె 30 కిలోల బరువు తగ్గించుకుంది. ప్రస్తుతం ‘ఏ వతన్ మేరే వతన్’, ‘మెట్రో', ‘మర్డర్ ముబారక్’ సినిమాలలో నటిస్తూ సారా బిజీగా ఉంది.




