Borewell: అయ్యో పాపం.. 70 అడుగుల బోరుబావిలో చిక్కుకున్న రోడ్డు నిర్మాణ కార్మికుడు..!

పంజాబ్‌లోని జలందర్‌ జిల్లా కర్తార్‌పూర్‌లో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి జమ్మూలోని కట్‌రా వరకు ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణ పనులు అక్కడ కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా పంజాబ్‌ జలంధర్‌లోని కర్తార్‌పుర్‌ సమీపంలో భారీ పిల్లర్‌ను ఏర్పాటు చేసేందుకు పెద్ద గొయ్యి తవ్వాడం అవసరమైంది. ఇందుకోసం బోరింగ్‌ యంత్రం సహాయంతో ఓ భారీ గుంత వేశారు. ఆ క్రమంలో బోరింగ్‌ యంత్రంలో సమస్య తలెత్తడంతో అందులోకి దిగిన ఇద్దరు కార్మికులు లోపల చిక్కుకుపోయారు..

Borewell: అయ్యో పాపం..  70 అడుగుల బోరుబావిలో చిక్కుకున్న రోడ్డు నిర్మాణ కార్మికుడు..!
Worker Stuck In Borewell
Follow us

|

Updated on: Aug 13, 2023 | 6:57 PM

చండీగఢ్‌, ఆగస్టు 13: రహదారి నిర్మాణంలో భాగంగా తొవ్విన భారీ బోరు లోపల ఓ కార్మికుడు ఇరుక్కుపోయాడు. ఈ ఘటనలో ఓ కార్మికుడు ప్రాణాలతో బయటపడగా.. మరో కార్మికుడు అందులోనే చిక్కుకుపోయాడు. ఈ ఘటన పంజాబ్‌లో శనివారం (ఆగస్టు 12) సాయంత్రం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. వివరాల్లోకెళ్తే..

పంజాబ్‌లోని జలందర్‌ జిల్లా కర్తార్‌పూర్‌లో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి జమ్మూలోని కట్‌రా వరకు ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణ పనులు అక్కడ కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా పంజాబ్‌ జలంధర్‌లోని కర్తార్‌పుర్‌ సమీపంలో భారీ పిల్లర్‌ను ఏర్పాటు చేసేందుకు పెద్ద గొయ్యి తవ్వాడం అవసరమైంది. ఇందుకోసం బోరింగ్‌ యంత్రం సహాయంతో ఓ భారీ గుంత వేశారు. ఆ క్రమంలో బోరింగ్‌ యంత్రంలో సమస్య తలెత్తడంతో అందులోకి దిగిన ఇద్దరు కార్మికులు లోపల చిక్కుకుపోయారు.

అనంతరం ఓ కార్మికుడు పైకి సురక్షితంగా వచ్చాడు. ఐతే సురేశ్‌ అనే వ్యక్తి మాత్రం 70 అడుగుల లోతులోనే చిక్కుకుపోయాడు. అతడిపై ఇసుక పడటంతో బయటకు రాలేకపోయాడని అధికారులు తెలిపారు. నిన్న శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. దీంతో ఈ విషయాన్ని అక్కడి వారు జిల్లా అధికారులకు తెలియజేశారు. జిల్లాయంత్రాంగం, జాతీయ విపత్తుల ప్రతిస్పందన దళం ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టాయి. గుంటలో చిక్కుకుపోయిన బాధితుడు సురేష్‌ను రక్షించేందుకు రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయని వారు తెలిపారు.

ఇవి కూడా చదవండి

గతనెలలో బీహార్‌లో బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి

గత నెలలో బీహార్‌లోని నలందాలోని కుల్ గ్రామంలో మూడేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిన ఘటన చోటుచేసుకుంది. ఆ చిన్నారిని శివం కుమార్‌గా గుర్తించారు. దాదాపు ఐదు గంటల పాటు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ తర్వాత చిన్నారిని సురక్షితంగా కాపాడినట్లు అధికారులు తెలిపారు. రక్షించిన చిన్నారిని చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు. గత నెలలో జరిగిన మరో ఘటనలో ఇంటి పెరట్లో ఆడుకుంటున్న రెండున్నరేళ్ల బాలిక 20 అడుగుల లోతున్న బోరుబావిలో పడి మృతి చెందింది. మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లా కజారి బర్ఖెడా గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. సహాయక బృందాలు చిన్నారిని కాపాడిన తర్వాత వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
అక్కడ వర్షాలకు వజ్రాలు దొరుకుతాయి.. రత్నాల వేటలో స్థానికులు..
అక్కడ వర్షాలకు వజ్రాలు దొరుకుతాయి.. రత్నాల వేటలో స్థానికులు..
ముగ్గురు చెప్పుల వ్యాపారుల ఇళ్లలో ఐటీ సోదాలు.. ఓ గది తెరవగా!
ముగ్గురు చెప్పుల వ్యాపారుల ఇళ్లలో ఐటీ సోదాలు.. ఓ గది తెరవగా!
పాపం అమ్మాయిలు.! స్నాక్స్ తింటుండగా ఏంటి ఇలా జరిగింది..
పాపం అమ్మాయిలు.! స్నాక్స్ తింటుండగా ఏంటి ఇలా జరిగింది..
ఈ 5 లక్షణాలు.. కడుపు క్యాన్సర్‌కు ముందస్తు సంకేతాలు కావొచ్చు..
ఈ 5 లక్షణాలు.. కడుపు క్యాన్సర్‌కు ముందస్తు సంకేతాలు కావొచ్చు..
ఒక నెల పాటు పప్పులు తినడం మానేస్తే మీ శరీరంపై ఎలాంటి ప్రభావం..
ఒక నెల పాటు పప్పులు తినడం మానేస్తే మీ శరీరంపై ఎలాంటి ప్రభావం..
ఐపీఎల్ 2024లోనే రికార్డ్ సిక్స్.. ఆర్‌సీబీ విక్టరీకి కారణమైన ధోని
ఐపీఎల్ 2024లోనే రికార్డ్ సిక్స్.. ఆర్‌సీబీ విక్టరీకి కారణమైన ధోని
'అయ్యో రామ - ఏమిటి ఈ ఖర్మ'.. పర్ణశాల ఆలయంలో భక్తుల భావన..
'అయ్యో రామ - ఏమిటి ఈ ఖర్మ'.. పర్ణశాల ఆలయంలో భక్తుల భావన..
రాత్రికి రాత్రే రూ.1000 కోట్లకు అధిపతైన రైతు.. ఎలాగంటే!
రాత్రికి రాత్రే రూ.1000 కోట్లకు అధిపతైన రైతు.. ఎలాగంటే!
పిల్లలు అబద్దాలు ఎందుకు చెబుతారో తెలుసా..? అసలు కారణం ఇదేనట!
పిల్లలు అబద్దాలు ఎందుకు చెబుతారో తెలుసా..? అసలు కారణం ఇదేనట!
మీ ఐ పవర్ రేంజ్ ఏపాటిది.? ఈ ఫోటోలోని అద్భుతాన్ని గురిస్తే.!
మీ ఐ పవర్ రేంజ్ ఏపాటిది.? ఈ ఫోటోలోని అద్భుతాన్ని గురిస్తే.!