Criminal Laws: కేంద్రం మరో సంచలన నిర్ణయం.. IPC, CRPC స్థానంలో కొత్త చట్టాలు! దేశద్రోహ చట్టం రద్దు

దేశంలోని నేర న్యాయ వ్యవస్థ బ్రిటిష్ వారు చేసిన చట్టాల ప్రకారం పనిచేసింది. బ్రిటీష్ పరిపాలనా కాలంలో తీసుకొచ్చిన ఈ చట్టాల ముఖ్య ఉద్ధేశ్యం శిక్షించడమే తప్ప న్యాయం చేయడం కాదు. వాటిని సవరిస్తూ మూడు కొత్త చట్టాలు తీసుకువస్తున్నాం. కొత్త బిల్లులు పౌరుల హక్కులను పరిరక్షిస్తాయి. కొత్త బిల్లుల లక్ష్యం శిక్షించడం కాదు, న్యాయం చేయడమే. ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్‌ యాక్ట్‌లు బ్రిటిష్‌ కాలం నాటి చట్టాలు. ఆంగ్లేయుల పాలనను రక్షించడం, బలోపేతం చేయడం, శిక్షించడమే లక్ష్యంగా వాటిని ప్రవేశపెట్టారు. బాధితులకు న్యాయం చేయడం వాటి ఉద్దేశం కాదు. కొత్త చట్టాలు నేరాలను అరికట్టాడమే లక్ష్యంగా శిక్షలు విధిస్తాయని..

Criminal Laws: కేంద్రం మరో సంచలన నిర్ణయం.. IPC, CRPC స్థానంలో కొత్త చట్టాలు! దేశద్రోహ చట్టం రద్దు
Union Minister Amit Shah
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 11, 2023 | 5:21 PM

న్యూఢిల్లీ, ఆగస్టు 11: బ్రిటిష్‌ కాలం నాటి న్యాయ చట్టాలకు స్వస్తి పలికేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం (ఆగస్టు 11) లోక్‌సభలో 3 బిల్లులను ప్రవేశపెట్టారు. 1860 ఇండియన్‌ పీనల్‌ కోడ్‌(భారత శిక్షా స్మృతి), క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌(CRPC), ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌(IEA) చట్టాలను భర్తీ చేసేలా కొత్త చట్టాలను తెరపైకి తీసుకొచ్చారు. ‘న్యాయం అందించడంపై దృష్టి పెట్టాలి, శిక్ష విధించడం ముఖ్యం కాదు’ అనే లక్ష్యంతో ఈ బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టినట్లు అమిత్ షా పేర్కొన్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన భారతీయ న్యాయ సంహిత-2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత-2023, భారతీయ సాక్ష్యా-2023.. ఈ మూడు బిల్లులు తదుపరి పరిశీలన కోసం పార్లమెంటరీ ప్యానెల్‌కు పంపినట్లు షా చెప్పారు.

ఈ సందర్భంగా హోం మంత్రి షా మాట్లాడుతూ.. ‘దేశంలో అమలులో ఉన్న న్యాయ వ్యవస్థ బ్రిటిష్ వారు చేసిన చట్టాల ప్రకారం పనిచేస్తోంది. బ్రిటీష్ పరిపాలనా కాలంలో తీసుకొచ్చిన ఈ చట్టాల ముఖ్య ఉద్ధేశ్యం శిక్షించడమే తప్ప న్యాయం చేయడం కాదు. వాటిని సవరిస్తూ మూడు కొత్త చట్టాలు తీసుకువస్తున్నాం. కొత్త బిల్లులు పౌరుల హక్కులను పరిరక్షిస్తాయి. కొత్త బిల్లుల లక్ష్యం శిక్షించడం కాదు, న్యాయం చేయడమే. ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్‌ యాక్ట్‌లు బ్రిటిష్‌ కాలం నాటి చట్టాలు. ఆంగ్లేయుల పాలనను రక్షించడం, బలోపేతం చేయడం, శిక్షించడమే లక్ష్యంగా వాటిని ప్రవేశపెట్టారు. బాధితులకు న్యాయం చేయడం వాటి ఉద్దేశం కాదు. కొత్త చట్టాలు నేరాలను అరికట్టాడమే లక్ష్యంగా శిక్షలు విధిస్తాయని’ అన్నారు.

ఇవి కూడా చదవండి

లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగం వీడియో..

దేశద్రోహ చట్టం రద్దు

కొత్త చట్టాల ప్రతిపాదన ప్రకారం.. దేశద్రోహ చట్టం రద్దు చేశారు. దాని స్థానంలో సెక్షన్ 150 తీసుకొచ్చారు. సెక్షన్ 150 ఏం చెబుతోందంటే.. ఎవరైనా, ఉద్దేశపూర్వకంగా మాటల ద్వారా లేదా రాతల ద్వారా లేదా సంకేతాల ద్వారా లేదా దృశ్యాల ద్వారా లేదా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా లేదా ఆర్థిక మార్గాలను ఉపయోగించడం ద్వారా లేదా ఇతరత్రా రెచ్చగొట్టే లేదా సాయుధ తిరుగుబాటు లేదా విధ్వంసక కార్యకలాపాలు లేదా వేర్పాటువాద కార్యకలాపాల భావాలను ప్రోత్సహించడం లేదా దేశ సార్వభౌమాధికారం లేదా ఐక్యత-సమగ్రతకు ప్రమాదం వాటిల్లేలా లేదా అలాంటి ఏదైనా చర్యలో పాలుపంచుకున్నా లేదా పాల్పడినా.. ఏడేళ్ల జైలు శిక్ష నుంచి జీవిత ఖైదు వరకు విధిస్తారు. అలాగే జరిమానా కూడా విధించబడుతుంది.

సభలో మాట్లాడుతోన్న ‘షా’ వీడియో

గ్యాంగ్‌ రేప్‌లకు 20 ఏళ్ల జైలు శిక్ష నుంచి జీవితఖైదు

ఇక దేశద్రోహ నేరానికి సంబంధించిన శిక్షల్లోనూ మార్పులు చేస్తున్నట్టు షా తెలిపారు. ప్రస్తుత చట్టం ప్రకారం.. దేశద్రోహానికి మూడేళ్ల నుంచి యావజ్జీవ కారాగార శిక్ష విధించబడుతుంది. కొత్త బిల్లు ప్రకారం.. మూడు నుంచి ఏడేళ్ల జైలు శిక్షగా మార్చాలని ప్రతిపాదించింది. మూక హత్యల కేసులకు ఉరిశిక్షను ప్రవేశపెడుతున్నట్లు షా పేర్కొన్నారు. జాతి, కులం, లింగం, ప్రదేశం, భాష, వ్యక్తిగత విశ్వాసం లేదా మరేదైనా కారణాలతో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది హత్యకు పాల్పడితే.. ప్రతి ఒక్కరికీ మరణశిక్ష విధించబడుతుంది. ఏడేళ్లకు పైగా శిక్షపడే కేసుల్లో ఫోరెన్సిక్‌ తనిఖీ తప్పనిసరి చేశారు. అత్యాచార చట్టంలోనూ మార్పులు చేశారు. మైనర్లపై అత్యాచారానికి పాల్పడే వారికి మరణశిక్ష విధించబడుతుంది. గ్యాంగ్‌ రేప్‌లకు 20 ఏళ్ల జైలు శిక్ష నుంచి జీవితఖైదు విధిస్తారు. అత్యాచారానికి గురైన వారి గుర్తింపును బహిర్గతం చేసినందుకు కూడా శిక్ష విధించబడుతుంది. ఇక క్రిమినల్‌ ప్రొసీజర్‌లో 300పైగా మార్పులు చేశారు. కేసుల సత్వర పరిష్కారం కోసం ఎక్కడ నుంచైనా ఈ-ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయొచ్చు. అలాగే వివిధ నేరాలకు జరిమానాలు, శిక్షలను కూడా పెంచారు. చిన్న చిన్న నేరాలకు సమాజ సేవలాంటి శిక్షలను సైతం విధిస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.