టమాటోలు వీరు అస్సలే తినకూడదంట.. తింటే కథ కంచికే ఇక!
samatha
5 april 2025
Credit: Instagram
ఏ ఇంట్లో నైనా సరే టమాటోలు లేకుండా ఉండదు. ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పకుండా టమాటోలు ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వీటిని తింటారు.
అంతే కాకుండా ఏ కూరలోనైనా సరే ఒక్క టమాటో వేస్తే ఆ కర్రీ టేస్టే మారిపోతుంది. అందుకే చాలా మంది మార్కెట్ కు వెళ్లినప్పుడు తప్పనిసరిగా టమాటోలు కొనుగోలు చేస్తారు.
ఇక ఇంకొంత మందికి టమాటో కర్రీ అంటే చాలా ఇష్టం ఉంటుంది. అంతే కాకుండా, బిర్యానీ, నుంచి చేపలు, చికెన్, మటన్ , ఇలా ఏ కర్రీలోకైనా టమాటో వేస్తే మంచి రుచి వస్తుంది.
టమాటోలు రుచిని పెంచడమే కాకుండా, వీటిలో శరీరానికి అవసరమయ్యే అనేక పోషకాలు ఉండటం వలన ఎక్కువ మంది టమాటోలను తినడానికి ఇష్టపడుతారు.
కానీ ఈ టమాటోలను కొన్ని రకాల వ్యాధులతో బాధపడే వారు అస్సలే తినకూడదంట. కాగా, ఎవరెవరు ఈ టమాటోలు తినకూడదో ఇప్పుడు చూద్దాం.
కిడ్నీ వ్యాధి సమస్యలతో బాధపడుతున్న వారు అస్సలే టమాటోలు తినకూడదంట. ఇది వారికి చాలా హానికరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
అదే విధంగా ఎవరైతే జీర్ణ సంబంధ వ్యాధులు, కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారో వారు కూడా అస్సలే టమోటో తినకూడదంట.
అలాగే కీళ్ల నొప్పులు, అలెర్జీలు ఉన్నవారు, దురద, దుద్దర్లు, శరీరంలో వాపులతో బాధపడు వారు, గుండెల్లో మంట సమస్య తో బాధపడే వారు అస్సలే టమోటోలు తినకూడదంట.