శ్రీరామ నవమి రోజున తప్పకుండా చేయాల్సిన పనులు ఇవే !
samatha
2 april 2025
Credit: Instagram
హిందువులకు ఇష్టమైన శ్రీరామన నవమి వచ్చేస్తుంది. ఏప్రిల్ 6న హిందువులు అందరూ ఎంతో ఘనంగా శ్రీరామనవమి వేడుకలను జరుపుకుంటారు.
శ్రీరాముడు యుగ పురుషుడు, ఏక పత్నీవ్రతుడుగా మంచి కీర్తిని పొందాడు అందుకే ప్రతి సంవత్సరం చైత్ర మాసం శుక్లపక్షం తొమ్మిదో రోజున శ్రీరామ నవమి జరుపుతారు.
ఈరోజు ప్రతి పల్లె, పట్నంలోని ప్రతి వీధిలో, ఆలయాల్లో శ్రీరాముని భజనలు, ఆయన కళ్యాణం చేస్తూ ఆనందంతో మురిసిపోతారు భక్తులందరూ.
అంతే కాకుండా శ్రీరామ నవమి రోజూ శోభాయాత్రలు నిర్వహిస్తుంటారు. అంత పవిత్రమైనది శ్రీరామ నవమి. అయితే ఈరోజున కొన్ని పనులు చేయడం వలన కష్టాలు తీరిపోతాయంట.
శ్రీరామనవమి రోజూ కొన్ని పనులు చేయడం వలన కష్టాలన్నీ దూరమై, సుఖసంతోషాలతో జీవితాన్ని గడుపుతారు అని చెబుతున్నారు పండితులు. అవి ఏవంటే?
ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడేవారు, శ్రీరామ నవమి రోజున ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లడమే కాకుండా, హనుమాన్ చాలీసా పఠించాలంట.
శ్రీరామ నవమి రోజున ఒక గిన్నెలో నీరు తీసుకొని, 108 సార్లు శ్రీరామ రక్ష మంత్రాన్ని జపించాలంట. తర్వాత ఆ నీరును ఇంట్లో చల్లడం వలన ధన లాభం కలుగుతుంది.
శ్రీరామ నవమి రోజున రామాయానికి వెళ్లి పూజ చేయించి, అక్కడ నూనెలేదా నెయ్యి దీపం వెలిగించడమే కాకుండా, జై శ్రీరామ్ అని 108 సార్లు జపించాలంట. దీని వలన ఇంట్లో సంతోషకర పరిస్థితులు ఏర్పడుతాయి.