చియా విత్తనాలు ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో ప్రోటిన్స్, యాంటి ఆక్సిడెంట్లు, ఓమెగా 3 వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి.
అందువలన వీటిని ప్రతి రోజూ తీసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాగా, వాటిని ఎలాం తీసుకోవడం వలన ఆరోగ్యానికి మేలో తెలుసుకుందాం.
చియా సీడ్స్‌ను రాత్రి పడుకునే ముందు గ్లాస్ పాలు లేదా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తాగాలి. దీని వలన రోగనిరోధక శక్తిపెరగడమే కాకుండా ఉత్సాహంగా ఉంటారు.
ఇలా ప్రతి రోజూ ఉదయాన్నే చియా సీడ్స్ తినడం వలన జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలగడమే కాకుండా, మలబద్ధకం, గ్యాస్ సమస్యలను దూరం చేస్తాయి.
అలాగే చియా విత్తనాలను జ్యూస్, లేదా నట్స్ లాంటి పండ్ల రసాలతో కూడా తీసుకోవచ్చు. దీని వలన ఆరోగ్యం బాగుంటుంది. కడుపు నిండుగా అనిపిస్తుంది.
ఇలా ప్రతి రోజూ చియా సీడ్స్ తీసుకోవడం వలన బరువు తగ్గవచ్చు. ముఖ్యంగా వ్యాయమయ చేసే వారు, ఈ విధంగా చియా సీడ్స్ తీసుకుంటే, తక్షణ శక్తి లభిస్తుందంటున్నారు నిపుణులు.
అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని చియా సీడ్స్ అస్సలే ఎక్కువగా తీసుకోకూడదంట. ఎందుకంటే? వీటిని ఎక్కువగా తినడం వలన జీర్ణ సమస్యలు కూడా వచ్ఛే చాన్స్ ఉన్నదంట.
చియా విత్తనాలు మీ డైట్‌లో మొదటి సారి ప్రారంభిస్తున్నప్పుడు వీటిని అధిక మోతాదులో కాకుండా, టీ స్పూన్ పరిమాణంలో తీసుకొని, క్రమంగా పెంచాలంట.