భోజనం చేసిన వెంటనే పాన్ తినడం వలన ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
samatha
16 march 2025
Credit: Instagram
పాన్ తినడం చాలా మందికి ఇష్టం. అందుకే భోజనం చేసిన వెంటనే చాలా మంది ఎంతో ఇష్టంగా పాన్ ఆకులు నములుతుంటారు.
అయితే భోజనం చేసిన వెంటనే పాన్ నమలడం వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో, దీని గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.
పాన్ ఆకులు జీర్ణ ఎంజైమ్‌లను కలిగిఉంటాయి. అందువలన వీటిని నమలడం వలన జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. మలబద్ధకం, ఉబ్బసం సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.
పాన్ ఆకులలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ మన పొట్టలోని చెడు గట్ బ్యాక్టీరియాతో పోరాడుతాయి. ఇన్ఫెక్షన్స్ ప్రమాదాల నుంచి మిమ్మల్ని కాపాడుతాయి.
పాన్ ఆకులను నమలడం వలన నాడీ వ్యవస్త పనితీరు బాగుంటుంది. ఇది ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా, ఆనందాన్ని కలిగించే హార్మోన్లను విడుదల చేస్తాయి.
వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందువల శరీరంలోని విషపదార్థాలను తొలిగించి, కాలేయం, మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది.
పాన్ ఆకులను నమలడం వలన శ్వాస కోశ వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. దీనిని తిన్న తర్వాత తినడం వలన దగ్గు లాంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగిస్తుంది.
పాన్ ఆకలను నమలడం వలన హనీకరమైన బ్యాక్టరీయా తగ్గిపోయి, నోటి ఆరోగ్యాన్ని పెంచుతుంది. చిగుళ్లను బలంగా చేసి కావిటీస్ నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. నోరు పరిశుభ్రత పెరుగుతుంది.