వందేళ్ల క్రితం బంగారం ధర ఇంత చీపా.. ఇప్పుడేమో ఏకంగా?

samatha 

15 march 2025

Credit: Instagram

బంగారం రోజు రోజుకు పరుగులు పెడుతుంది. పెరుగుతున్న గోల్డ్ ధరలు చూస్తే సామాన్యుల గుండెల్లో వణుకు పుడుతుంది.

ఎందుకంటే ఇంట్టో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సరే బంగారం పెట్టడం లేదా? బంగారు ఆభరణాలు ధరించడం కామన్. ముఖ్యంగా వివాహం జరిగితే తప్పకుండా బంగారం కొనుగోలు చేస్తారు.

కానీ ఈరోజుల్లో చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. రోజు రోజుకు గోల్డ్ రేట్స్ ఆకాశాన్ని అంటుతున్నాయి.

కానీ వందేళ్ల క్రితం బంగారం ధరలు చూస్తే.. వామ్మో అప్పుడు బంగారం ఇంత చౌకగా దొరికిందా అని నోరెళ్లబెట్టడం ఖాయం. కాగా, ఆ రోజుల్లో బంగారం ధర ఎంత ఉందో చూద్దాం పదండి మరి.

వంద సంవత్సరాల క్రితం (తులం బంగారం ధర) 10 గ్రాముల బంగారం ధర రూ. 18.75 పైసలంట. 1925లో ఈ ధరలో తులం బంగారం లభించేది.

తర్వాత భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తులం బంగారం ధర కేవలం రూ.99 మాత్రమే ఉండేదంట. తర్వాత 2015లో 26000 ఉందంట.

ప్రస్తుతం తులం బంగారం ధర రూ.82000 చిల్లర ఉంటుంది. రోజు రోజుకు ఈ ధరలు పెరుగుతున్నాయి. దీంతో సామాన్యులు బంగారం కొనాలంటే భయపడిపోతున్నారు

కొన్ని లెక్కల ప్రకారం బంగారం ధర సంవత్సరానికి దాదాపు ఎనిమిది నుంచి 10 వేల మధ్య పెరుగుతున్నట్లు సమాచారం. ఇది ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇచ్చిన సమాచారం.