సోషల్ మీడియా వచ్చాక వింతలు , విషేషాలకు కొదవే లేకుండా పోయింది. ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా ఇట్టే తెలుసుకుంటున్నాం.
మరీ ముఖ్యంగా ఏ చిన్న ఇంట్రెస్టింగ్ విషయం అయినా సరే సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతుంది. అయితే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ ఊరు నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతుంది.
ప్రపంచంలో ఎన్నో వింతలు దాగున్నాయి. ఒక్కో చోట ఒక్కో విచిత్ర సాంప్రదాయలు, ఆచార వ్యవహారాలు ఉంటాయి. ఇక ఏ ఊరిలోనైనా ఆడవారు, మగ వారు ఉండటం కామన్.
కానీ ఒక్క ఊరిలోకి మాత్రం మగవారికి అస్సలే ఎంట్రీ లేదంట? అది ఏ ఊరు? ఎందుకు ఆ ఊరిలోకి మగవారిని అనుమతించరో అనే విషయాలు తెలుసుకుందాం.
ఉత్తర కెన్యాలోని సంబురు ప్రాంతంలో ఉమోజా అనే ఊరు ఉంది. అయితే, అక్కడ ఆడవాళ్లు తమ ఊరిలోకి మగవారిని అనుమతించరంట. ఆడవారు మాత్రమే ఆ ఊరిలో ఉంటారు.
అయితే ఉమోజా అనే ఈ ఊరును,1990లో 15 మంది ఆడవాళ్లు కలిసి స్థాపించినట్లు సమాచారం. ఈ ఆడవాళ్లు తమ జీవితాల్లో హింసా, అత్యాచారం, బాల్యవివాహాలకు గురయ్యారు.
అందుకే వాళ్లు బాధిత మహిళల కోసం ప్రత్యేకమైన ఊరిని స్థాపించారంట, ఈ ఊరిలో ప్రతి నిర్ణయం వారే తీసుకుంటారు, వ్యవసాయం పనులు చేస్తారు, అలాగే వారికి నచ్చినట్లు బతుకుతారంట.
అంతే కాకుండా ఉమోజా ఊరిలో ఆడవారు మగవారికి జన్మనిస్తే,18 ఏళ్లు వచ్చే వరకు తమతో ఉండొచ్చునంట. తర్వాత ఊరు వదిలి వెళ్లిపోవాలంట.
మగవారు ఆ ఊరికి రావచ్చునంట. కానీ వారు ఆ విలేజ్‌కు వచ్చి సూర్యస్తమయం అయ్యేలోపే ఆ ఊరి నుంచి వెళ్లిపోవాలంట. అది ఆ ఊరి ఆడవారి కండీషన్