వామ్మో..సాయిపల్లవి ఒక్క రోజులో అన్ని లీటర్ల కొబ్బరి నీళ్లు తాగుతుందా?

samatha 

9 march 2025

Credit: Instagram

టాలీవుడ్ నేచురల్ బ్యూటీ సాయిపల్లవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చాలా సింపుల్‌గా కనిపిస్తూనే కుర్రకారు మనసు దోచేసింది ఈ ముద్దుగుమ్మ.

ప్రేమమ్ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన ఈ అందాల ముద్దుగుమ్మ మొదటి సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది.

తర్వాత వరుణ్ తేజ్ సరసన, ఫిదా మూవీలో నటించి తెలంగాణ అమ్మాయిలో తన నటనతో ప్రశంసలు అందుకుంది. వచ్చిండే మెల్లమెల్లగ వచ్చిండే అంటూ..యూత్  ఫేవరెట్2గా  మారింది.

ప్రస్తుతం వరస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ , కెరీర్ పరంగా టాప్‌లో దూసుకెళ్తుంది.

ఇక ఈ మధ్య తండేల్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ. దీంతో సాయిపల్లవి క్రేజ్ మరింత పెరిగింది. 

ఈ క్రమంలోనే  సాయిపల్లవికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ అది  ఏమిటంటే?

రీసెంట్‌గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ తన స్కిన్ సీక్రెట్ రివీల్ చేసింది. హెల్త్ అండ్ గ్లో ఫేస్‌కు ఎలాంటి సీక్రెట్ అని అడగ్గా, సాయిపల్లవి దానికి సమాధానం ఇస్తూ..

ప్రతి రోజు మూడు లీటర్ల కొబ్బరి నీళ్లు తాగుతాను. అలాగే పెరుగు,  మజ్జిగా  ఎక్కువగా తింటాను అని చెప్పుకొ చ్చింది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట హాట్ టాపిక్  అవుతోంది.