హోలీ స్పెషల్.. అందరూ ఇష్టపడే పానీపూరిని ఇలా తయారు చేసుకోండి!
samatha
7 march 2025
Credit: Instagram
పానీ పూరి అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా సాయంత్రం కాగానే, చాలా మంది అమ్మాయిలు పానీ పూరి తినడానికి బయటకు వెళ్తుంటారు.
హోలీ పండుగ సందర్భంగా చాలా మంది ఏదైనా స్పెషల్ వంటకం చేసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారు ఎలాంటి కష్టం లేకుండా, ఇంట్లోనే పానీ పూరిని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం.
1/2సూజీ, 1స్పూన్ మైదా, 1/4 కప్పు వేడి నీరు, 2స్పూన్ల నూనె, ఉప్పు. మాసాలా కోసం, నాలుగు ఉడికించిన బంగాళా దుంపలు, 1 ఉల్లిపాయ, 2స్పూన్ల కొత్తిమీర, ఉప్పు, మిరియాలు, 1 స్పూన్ చాట్ మసాలా, 2స్పూన్ల నిమ్మరసం.
1/2 కప్పు ఉడికించిన తెల్ల మటర్,1 టీ స్పూన్ ఎర్రకారం, 2 పచ్చి మిర్చి, రెండు కప్పుల నీరు, 1/2 కప్పు చింతపండు రసం, ఉప్పు, మిరియాలు, 1 టీ స్పూన్ నల్ల మిరియాలు, 1 టేబుల్ స్పూన్ నల్ల ఉప్పు.
1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 కప్పు బూందీ,, రెండు టేబుల్ స్పూన్ కొత్తిమీర, 1 రెమ్మ పూదీనా ఆకలు. ఇవన్నీ పదార్థాలు పానీ పూరి తయారు చేయడానిక తీసుకోవాలి.
తర్వాత నూజీ ని వేడినీటిలో బాగా కలపాలి.దీనికి మైదా, ఉప్పు, నూనె వేసి గట్టి పిండిలా పిసికి, 15 నిమిషాల వరకు అలాగే ఉండనివ్వాలి.
సన్నగా మరియు, చిన్నగా పూరీలను తీసి వాటినిడీప్ ఫ్రై చేయాలి. దీంతో పానీ పూరీలు తయారు అయినట్లే. స్టఫింగ్ చేయడానికి ఒక గిన్నెలో బంగాళాదుంపలను మెత్తగా చేయాలి.
దీనికి ఉడికించిన తెల్ల మటర్, తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉప్పు, ఎర్రకారం, చాట్ మసాలా, కొత్తి మీర, నిమ్మరసం వేసి బాగా కలపాలి. నీళ్ల కోసం ఒక మిక్సింగ్ బౌల్‌లో రెండు కప్పుల నీరు తీసుకొని, ఉప్పు, మిరియాలు, చాట్ మసాలా.
తెల్ల మిరియాలు, నల్ల ఉప్పు, కొత్తిమీర, బూందీ, పూదీన ఆకులు, చింతపండు రసం వేసి బాగా కలపాలి. దీంతో మసాలా చాట్, పానీ పూరీలు, రసం తాయరు అయిపోయినట్లే.