చాణక్య నీతి : ఈ లక్షణాలు ఉన్నవారు ఎప్పటికీ డబ్బు సంపాదించలేరు!
samatha
4 march 2025
Credit: Instagram
డబ్బు సంపాదించాలని ఎవరూ అనుకోరు. ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించి గొప్పగా బతకాలి అనుకుంటారు. కానీ కొంత మంది మాత్రమే డబ్బును పొదుపు చేసి ఉన్నతంగా ఉంటారు.
ఇంకొంత మంది ఎంత డబ్బు సంపాదించినా సరే అది త్వర త్వరగానే ఖర్చు అయిపోతూ ఉంటుంది. దీంతో వీరు ఎక్కువగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు.
అయితే అపర జ్ఞానుడు, గొప్ప పండితుడు ఆచార్య చాణక్యుడు మానవవాళి జీవించడానికి ఉపయోగపడే ఎన్నో విషయాల గురించి తెలియజేయడం జరిగింది.
అయితే ఆయన రచించిన తన నీతి శాస్త్రం పుస్తకంలో, ఈ మూడు లక్షణాలు ఉన్న వ్యక్తి జీవితాంత డబ్బు సంపాదించాలని ఆరాటపడతారు కానీ వారు ఒక్కరూపాయి కూడా పొదుపు చేయలేరని తెలిపారు.
ఇంతకీ వారు ఎవరు? ఎలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి వద్ద డబ్బు నిలవదు అనే విషయాలను మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
కొంత మంది డబ్బు సంపాదించాలని ఎక్కువగా ఆరాటపడుతారు. కానీ నిత్యవసరాల మీద కాకుండా అనవసర విషయాలకు అతిగా డబ్బు ఖర్చు చేస్తారు. అలాంటి వారు జీవితంలో డబ్బును పొదుపు చేయలేరంట.
సోమరి స్వభావం ఉన్న వ్యక్తులు డబ్బు సంపాదించాలని ఆలోచిస్తారు కానీ, పని చేయడానికి ఆసక్తి చూపరు. సోమరితనం ఉన్నవారంటే లక్ష్మీ దేవికి కోపం, అలాంటి వారు ఎప్పుడూ డబ్బు సంపాదించలేడని చాణక్యడు తెలిపారు.
అదే విధంగా ఎప్పుడూ కోపంగా మాట్లాడే వ్యక్తి, తాను మాట్లాడే విధానం గురించి ఆలోచించకుండా, ప్రవర్తించే వ్యక్తి వద్ద ఎప్పుడూ లక్ష్మీ దేవి ఉండటానికి ఇష్టపడదు అంట.