క్యూట్‌గా స్మైలిస్తున్న చిన్నది.. గ్లామర్‌తో కుర్రకారును ఆగం చేస్తున్న క్రేజీ బ్యూటీ!

samatha 

2 march 2025

Credit: Instagram

బుగ్గలతో చూడటానికి చాలా క్యూట్‌గా  కనిపిస్తూ తన స్మైల్‌తో ఆకట్టుకుంటున్న ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా?

మొదటిసినిమాతోనే కుర్రకారు మనసు దోచేసి,   తన గ్లామర్‌తో యూత్‌కు నిద్ర లేకుండా చేస్తున్న అందాల ముద్దుగుమ్మ.

ఇంతకీ ఈ బ్యూటీ ఎవరా అని ఆలోచిస్తున్నారా? అనుపమా పరమేశ్వరన్. 2015లో మలయాళ చిత్రంతో  వెండితెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.

ప్రేమమ్ సినిమాతో తెలుగు వెండితెరకు హీరోయిన్‌గా పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే తన నటన, అందంతో అందరినీ ఆకట్టుకుంది.

దీంతో తర్వాత వరసగా ఆఫర్స్ అందుకుంటూ మంచి ఫేమ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ  అరడజన్ సినిమాలతో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ మధ్య ఈ అమ్మడు చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుటున్నాయి. రీసెంట్‌గా ఈ బ్యూటీ డ్రాగన్ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది .

హీరో సిద్ధు జొన్నలగడ్డ సరసన టిల్లు స్క్వేర్ మూవీలో ఎప్పుడూ లేని విధంగా గ్లామర్ డోస్ పెంచి, తన హాట్ నెస్‌తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.

ఇక ప్రస్తుతం ఈ బ్యూటీకి సంబంధించిన చిన్ననాటి ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి . దీంతో అను చాలా క్యూట్ గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.