మీ పిల్లలు ఫోన్‌కు అడెక్ట్ అయ్యారా.. ఈటిప్స్ ట్రై చేయండి!
samatha
1 march 2025
Credit: Instagram
ప్రస్తుతం చిన్నపిల్లలు టీవీ లేదా ఫోన్‌కు ఎక్కువగా అడెక్ట్ అయిపోతున్నారు. ఫోన్, టీవీ లేకుండా కొంత సేపు కూడా ఉండలేకపోతున్నారు.
మొబైల్ ఫోన్ లేనిదే కొందరు పిల్లలైతే అన్నం కూడా తినడం లేదు. ఆడుకోవడం మానేసి ఫోన్‌లో వీడియోస్ చూడటానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు
దీంతో చాలా మంది తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మా పిల్లలు టీవీ, ఫోన్‌కు ఎక్కువ అడెక్ట్ అయిపోయారంటూ వాపోతున్నారు.
వారిని వాటి నుంచి ఎలా తప్పించాలి? లేకపోతే వారి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందంటూ కంగారు పడుతున్నారు. కాగా, వారికోసమే బెస్ట్ టిప్స్.
పిల్లలను మొబైల్ ఫోన్ లేదా టీవీ నుంచి అడెక్ష్‌న్ నుంచి బయటకు తీసుకరావాలి అంటే తల్లిదండ్రులు తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాలంట. అవి ఏవి అంటే?
ముందుగా తల్లిదండ్రులు, పిల్లల ముందు ఫోన్ ఎక్కువగా చూడటం ఆపేయాలంట. ఎందుకంటే వారు మిమ్మల్ని చూసే ఎక్కువ నేర్చుకుంటారు.
మీ పిల్లలకు అవుట్ డోర్ గేమ్స్‌ను ఎంకరేజ్ చేయాలి. కాస్త టైమ్ కేటాయించి, వారిని బయటకు తీసుకెళ్లి వారితో కాసేపు సమయం కేటాయించాలి.
అలాగే మీ పిల్లలు ఫోన్ లేదా టీవీలకు అతక్కుపోకుండా ఉండటానికి వారిని ఇంటిపనులు చేసేలా ప్రోత్సహించాలి. అంతే కాకుండా చిన్న చిన్న పనులు చేయడం ఎలానో వారికి నేర్పించాలి.
అదే విధంగా మీరు మీ పిల్లలతో ఎక్కువ సమయం కేటాయించాలి. వారితో మీ అనుబంధాన్ని పెంచుకోవాలి. మంచి కథలు చెబుతూ వారిని స్మార్ట్ ఫోన్ కు బానిస అవ్వకుండా చూసుకోవచ్చు.