చాణక్య నీతి : ఈ పనులు చేసిన తర్వాత స్నానం చేయడం లేదా..ఇది పెద్ద తప్పు!
samatha
27 February 2025
Credit: Instagram
ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. తత్వ వేత్త, ఈయన రచించిన తన నీతి శాస్త్రం ద్వారా అనేక విషయాలను తెలియజేయడం జరిగింది.
ముఖ్యంగా తన జీవితంలోని అనుభవాల ఆధారంగా రూపొందిచిన ఈ పుస్తకంలో, మానవవాళికి ఉపయోగపడే ఎన్నో అంశాలను తెలిపారు.
అయితే ఒక వ్యక్తి ఎలాంటి సమస్యలు లేకుండా, ఆరోగ్యకరమైన, సంపన్నమై జీవితాన్ని గడపాలి అంటే కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలంట.
ముఖ్యంగా కొన్ని పనులు చేసిన తర్వాత తప్పకుండా స్నానం చేయాలంట. లేకపోతే అది పెద్ద తప్పే కాకుండా, సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంట.అవి :
చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి దహన సంస్కారాల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత తప్పకుండా స్నానం చేయాలంట. లేకపోతే ఇది పెద్ద తప్పు అవుతుందంట.
అంత్యక్రియలకు హాజరైన తర్వాత దహన సంస్కారాల స్థలం నుండి తిరిగి వచ్చినప్పుడు, ఆ సమయంలో మీ శరీరం అపవిత్రమవుతుంది. అందుకే ,ఇంట్లోకి ప్రవేశించే ముందు స్నానం చేయాలని పెద్దలు చెప్తారు.
అలాగే చాణక్య నీతి ప్రకారం, జుట్టు కత్తిరించుకొని, ఇంటికి వచ్చిన సమయంలో తప్పకుండా స్నానం చేసిన తర్వాతనే ఇంటిలోపలకి వెళ్లాలి అంటున్నారు చాణక్యుడు.
అదే విధంగా ఎవరైతే బాడీ మసాజ్ చేయించుకుంటారో వారు కూడా, తప్పకుండా స్నానం చేయాలి అంట. మసాజ్ చేయించుకున్న తర్వాత మీరు స్నానం చేయకపోతే, మీ శరీరం మొత్తం జిగటగా ఉంటుంది.