మహా శివరాత్రి రోజు తప్పకుండా గుడికి వెళ్లాల్సిన రాశులివే!

samatha 

25 February 2025

Credit: Instagram

 ఫిబ్రవరి 26న మహా శివరాత్రి. ఈరోజు భక్తులందరూ, ఉపవాసం ఉంటూ, మహాశివుడిని భక్తి శ్రద్ధలతో కొలుస్తారు.నేడు  కొంత మంది శివాలయాలకు వెళ్లి పూజలు చేస్తే, మరికొందరు ఇంట్లోనే శివ పూజలు చేస్తారు

కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ రాశుల వారు మహా శివరాత్రి రోజు తప్పకుండా శివాలయాలకు వెళ్లాలంట. కాగా, ఏ రాశి వారు ఏ ఆలయానికి వెళ్తే మంచిదో తెలుసుకుందాం.

తుల రాశి వారు మీ జీవితం ఎలాంటి సమస్యలు లేకుండా సాఫీగా సాగిపోవాలి అంటే తప్పకుండా శివాలయానికి వెళ్లాంట. గుడికి వెళ్లి శివయ్యను దర్శించుకోవడం వలన ఆరోగ్యం బాగుంటుందంటున్నారు పండితులు.

సింహ రాశి వారు శివుడికి అంకితం చేయబడిన రామనాథ స్వామి ఆలయాన్ని సందర్శించడం వలన, అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థికంగా బాగుంటుంది.

మిథున రాశి వారు త్రయంబకేశ్వర్ ప్రసిద్ధ ఆలయాన్ని సందర్శించడం వలన మీ చుట్టూ ప్రశాంతకర వాతావరణం ఏర్పడటమే కాకుండా, ఆరోగ్యం బాగుంటుంది.

కర్కాటక రాశి వారు పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటైన, సోమనాథుడి ఆలయాన్ని సందర్శించడం వలన మీరు కోరిన కోర్కెలు నెరవేరుతాయంట. అంతే కాకుండా ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

కుంభరాశి వారు జంబుకేశ్వరర్ ఆలయాన్ని సందర్శించడం వలన మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలిగిపోయి, ఆనందంగా ఉంటారంట. అంతే కాకుండా ఆర్థికంగా ధృఢంగా ఉంటారు.

మేష రాశి వారు మహా శివరాత్రి రోజున కేదార్ నాథ్, ఆలయాన్ని సందర్శించడం వలన మీ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను సులభంగా ఎదుర్కోగలుగుతారు అంటున్నారు పండితులు.