పిల్లి గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా.. దీనికి స్వీట్ పెడితే..
samatha
23 February 2025
Credit: Instagram
పిల్లుల గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. చాలా మంది తమ ఇంట్లో పిల్లులను ఎంతో ఇష్టంగా పెంచుకుంటుంటారు.
కానీ పిల్లుల గురించి చాలా మంది కొన్ని విషయాలు తెలియవు. కాగా దీనికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకుందాం.
పిల్లులు సూపర్ హీరోల మాదిరిగా నేల కంటే ఐదు రేట్లు ఎత్తు వరకు దూకగలవంట. అంతే కాకుండా పిల్లులు ఎప్పుడూ చాలా యాక్టివ్ గా ఉంటాయి
పిల్లులు రోజుకు దాదాపు పన్నెండు నుంచి 16 గంటల వరకు నిద్రపోతాయంట. ముఖ్యంగా పెద్ద పిల్లులు నిద్రపోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయంట.
పిల్లులు దాదాపుగా 100 రకాల శబ్ధాలు చేయగలవంట. కానీ కుక్కలు మాత్రం కేవలం 10 రకాల శబ్దాలు మాత్రమే చేస్తాయంట.పిల్లుల నిర్మాణం దాదాపు మానవ మెదడుతో సమానంగా ఉంటుంది.
పిల్లుల నాలుగా చిన్న ముళ్ల లాంటి నిర్మాణంలో ఉంటుంది. ఇవి ఈజీగా మురికిని తొలిగిస్తాయి. అంతే కాకుండా పిల్లులు వాటి చర్మాన్ని తమ నాలుకతో శుభ్రం చేసుకుంటాయంట.
పిల్లులు తీపిని రుచి చూడలేవంట. దీని నాలుకకు తీపి రుచిని గ్రహించే సామర్థ్యం లేకపవడం వలన ఇవి తీపి పదార్థాలను మీరు పెడితే వాటిని తినడానికి ఇష్టపడవంట.
ఈ పిల్లులు దాదాపు 70 మిలియన్ సంవత్సరాల క్రితం కనిపించాయని నమ్ముతారు. ఇక ఇది తన పరిసరాల్లోని చిన్న మార్పులను కూడా ఈ జీగా గమనిస్తుందంట.