కలలు రావడం అనేది సహజం. ప్రతి ఒక్కరికీ కలలు వస్తుంటాయి. ఇక కలలో కొందరికి పూర్వికులు కనిపిస్తే మరికొందరికి దేవుడి విగ్రహాలు కనిపిస్తాయి.
స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని కలలు శుభాలనిస్తే, మరికొన్ని కలలు సమస్యలను తీసుకొస్తాయని, అశుభ కలలు అని చెబుతుంటారు.
అయితే స్వప్నశాస్త్రం ప్రకారం, కలలో శివుడు కనిపిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
కలలో శివుడికి సంబంధించిన విగ్రహాలు లేదా, శివాలంయం లేదా ఆవులను, చంద్రవంక గనుక చూసినట్లైతే అది చాలా మంచిదంట.
దీని వలన మీ జీవితంలో ఏదో గొప్ప మార్పు జరగబోతుందని, దానికి సూచికగా ఆ శివయ్య కలలో కనిపిస్తున్నాడంటున్నారు స్వప్నశాస్త్ర నిపుణులు.
అంతే కాకుండా మీరు చాలా కాలంగా ఆర్థికసమస్యలతో బాధపడుతున్నట్లైతే వాటి నుంచి విముక్తి లభిస్తుందంట. ధనలాభం కలుగుతుంది.
ఒక వేళ కలలో శివల లింగం కనిపించినట్లైతే ఇది చాలా మంచిదంట. దీని వలన మీ ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలన్నీ తొలిగిపోతాయని, విజయానికి ఈ కల సంకేతం అంట.
ఒక వేళ మీరు కలలో గనుక శివ పార్వతులను చూస్తే మీ జీవితంలో సుఖసంతోషాలు రాబోతున్నాయి. ఆనందకర జీవితానికి సూచికగా శివపార్వతులు కలలో కనిపిస్తారంటున్నారు స్వప్న శాస్త్ర నిపుణులు.