శివరాత్రి రోజు పొరపాటున చేయకూడని తప్పులు ఇవే..చేశారో..!
samatha
21 February 2025
Credit: Instagram
మహాశివరాత్రికి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది.ఇక ఈసారి ఫిబ్రవరి 26న మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు.
ఈరోజున భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఆ మహాదేవున్నీ కొలుచుకుంటారు. భక్తులు శివలింగాన్ని పాలు, తేనె, గంధం, బిల్వపత్రాలు, పువ్వులతో అభిషేకం చేస్తారు.
అంతే కాకుండా ఆరోజు మొత్తం ఉపావాసం ఉంటూ శివనామస్మరణ చేస్తారు.అయితే ఈ రోజు కొంత మంది తెలిసి తెలియక కొన్ని తప్పులను చేస్తారు. కానీ ఈ రోజు అస్సలే ఈ పొరపాట్లు చేయకూడదంట.
శివరాత్రి రోజున ఎట్టిపరిస్థితిలో నలుపు రంగు దుస్తులను ధరించకూడదంట. తెలుపు లేదా లేత పసుపురంగు దుస్తులను ధరించడం మంచిది.
శివరాత్రి రోజు అస్సలే కేతకి లేదా కేవడ పూలతో శివయ్యకు పూజ చేయకూడదంట. తెల్లని పూలతో పూజ చేయడం చాలా మంచిది.
.శివరాత్రి రోజు పూజ చేసే సమయంలో ఎట్టిపరిస్థితిలో శివయ్యకు తులసి ఆకులను సమర్పించకూడదంటున్నారు పండితులు.
శివయ్యకు పాలతో అభిషేకం చేస్తారు. అయితే ఈ క్రమంలో తప్పనిసరిగా రాగి పాత్రను మాత్రమే ఉపయోగించాలని చెబుతున్నారు నిపుణులు.
శివరాత్రికి పూజ చేసి ప్రతి ఒక్కరూ కొబ్బరి కాయను కొడుతుంటారు. అయితే ఎట్టిపరిస్థితిలో కొబ్బరి నీళ్లతో శివయ్యకు అభిషేకం చేయకూడదంట.