మల్లెపూలు చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి. అంతే కాకుండా ఇవి మంచి సువాసనను వెదజల్లుతాయి. చాలా మంది మహిళలు వీటిని ఎక్కువగా ఇష్టపడుతుంటారు.
అయితే అంతగా ఇష్టపడే ఈ మల్లెపూల చెట్లను ఇంట్లో పెంచుకోవడానికి ఎవరూ ఆసక్తి చూపరు. కాగా, అసలు మల్లెపూల చెట్లను ఎందుకు ఇంట్లో పెంచుకోరో ఇప్పుడు చూద్దాం.
చాలా మంది ఇంట్లో మనీ ఫ్లాంట్ లాంటి షోకేజ్ ట్రీస్ ను పెంచుకుంటుంటారు. కానీ సువాసన వెదజల్లే మల్లె చెట్టును పెంచుకోరు. అయితే దీనికి ఓ కారణం ఉన్నదంట.
మల్లె చెట్టు దరదృష్టాన్ని తెచ్చి పెడుతుంది అంటున్నారు పండితులు. మరీ ముఖ్యంగా ఈ చెట్టును తప్పుడు దిశలో నాటడం వలన ఇంట్లో అశాంతి నెలకొనడం, ఆర్థికసమస్యలు తలెత్తడం జరుగుతుందంట.
అందుకే ఈ మొక్కను ఇంటి పరిసరాల్లో నాటేటప్పుడు ఉత్తరం, తూర్పు లేదా ఈశన్యంలో నాటాలంటున్నారు నిపుణులు.
మల్లె మొక్కను ఇంటి లోపల పెట్టుకోవడం వలన అది ఇంటిలోని సంపదను నాశనం చేస్తుందంట. అంతే కాకుండా, దీనిని ఇంట్లో పెంచుకోవడం వలన అలెర్జీ వంటి సమస్యలు తలెత్తుతాయంట.
మల్లె మొక్కను ఇంట్లో పెట్టుకోవడం వలన వీటి వాసనకు తేనెటీగలు ఇంట్లో దూరే అవకాశం ఉంది. దీంతో చిన్నపిల్లలను లేదా ఎవరినైనా ఇవి కుట్టే అవకాశం ఉన్నందున ఇంటిలోపల ఈ మొక్కను పెంచుకోరంట.
అంతే కాకుండా మల్లె పూల చెట్లను ఇంట్లో పెట్టుకోవడం వలన వాటి సువాసనకు పాములు కూడా ఇంట్లోకి వచ్చే అవకాశం ఉన్నందున వాటి ఇంట్లో పెంచుకోరంట.