భజరంగీ భాయిజాన్ సినిమాలో నటించిన మున్నీ పాపను ఎవరు మర్చిపోతారు చెప్పండి. మూవీలో హీరోకు ఏ మాత్రం తగ్గకుండా తన నటనతో ఆకట్టుకుంది ఈ చిన్నారి.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన భజరంగీ భాయిజాన్ మూవీ 2015లో రిలీజై రికార్డ్స్ క్రియేట్ చేసింది.
ముఖ్యంగా ఈ సినిమాలో నటించిన చిన్న పాప హర్షాలీ మల్హోత్ర ఏడేళ్ల వయసులోనే తన నటనతో ఎంతో మంది మనసు దోచుకుంది.
పాకిస్తానీకి చెందిన ఓ మూగ చెవిటి పాప మున్నీను తన కన్నవారి వద్దకు చేర్చడానికి భారతీయ యువకుడు ఎన్నిసమస్యలు ఫేస్ చేశాడు అనేది ఈ సినిమా కథ.
ఇందులో హర్షాలీ మల్హోత్రా మున్నీ ప్రాతలో నటించగా, సల్మాన్ ఖాన్ భారతీయ యువకుడి పాత్రలో నటించి, తమ నటనతో ఆకట్టుకున్నారు.
ఈ మూవీలో మున్నీగా హర్షాలి చాలా క్యూట్‌గా కనిపిస్తూ.. మాటలు లేకున్నా, తన హావభావాలతో అందరినీ కట్టిపడేసింది.
ఇక ఇప్పుడు ఆ పాప ఎలా ఉందనే ఆలోచన చాలా మందిలో కలుగుతుంటుంది. కాగా, ఇప్పుడు ఆ చిన్నారి లేటేస్టు ఫోస్ చూసేద్దాం.
అచ్చం దేవకన్యలా మున్నీ చాలా గ్లామరస్‌గా కనిపిస్తుంది ఫోటోల్లో, ఇది చూసిన తన ఫ్యాన్స్ అచ్చం అప్సరే, సినిమాల్లోకి ఎప్పుడు వస్తావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.