లవర్ లేదని బాధపడుతున్నారా.. మీ కోసమే అదిరిపోయే న్యూస్!
samatha
13 february 2025
Credit: Instagram
ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు. ఈ రోజు ప్రేమికులు బహుమతులు ఇచ్చుకుంటూ, పార్కుల్లో లేదా తమకు ఇష్టమైన ప్లేసెస్ కు వెళ్లి చాలా సరదాగా గడుపుతారు.
అయితే ప్రేమికులను చూసి సింగిల్స్ తెగ ఫీల్ అయిపోతుంటారు. తమకు లవర్ లేదు, వాలెంటైన్స్ డేను ఎలా జరుపుకోవాలని బాధపడుతారు.
కాగా, అలాంటి వారికోసమే ఈ అదిరిపోయే సమాచారం. లవర్ లేకున్నా వాలెంటైన్ డేను ఎంజాయ్ చేయవచ్చునంట. అది ఎలా అంటే?
మీరు సింగిల్ అని మర్చిపోయి, ప్రేమికుల రోజు మీకు దగ్గరిలోని ఏదైనా స్వచ్ఛంద సంస్థలో వాలంటీర్గా పని చేయండి. అనాధ పిల్లలతో ఆరోజు మొత్తం ఆనందంగా గడపండి.
దీని వలన ప్రేమికుల కంటే మీరే ఎక్కువ సంతోషంగా ఉంటారు. ఈ రోజు మీ జీవితంలోనే మర్చిపోలేని ఓ తీపి ఙాపకంగా మరిపోతుంది.
అలాగే, మీ స్నేహితులతో కలిసి సరదగా ట్రిప్ కు వెళ్లండి. దీంతో వారితో మీరు చాలా ఆనందంగా గడుపుతారు. లవర్ లేదు అనే ఫీలింగే మీలో కలగదు.
మీరు ఒంటరిగా ఫీల్ కాకుడదంటే, స్పాకి వెళ్లండి, మంచి మసాజ్ చేయించుకోవచ్చు. సువాసన వెదజల్లే కొవ్వొత్తులు వెలిగించి హాయిగా మ్యూజిక్ వింటూ సోలో డేట్ ఎంజాయ్ చేయొచ్చు.
ఎంజాయ్ చేయాలంటే లవరే ఉండాల్సిన పనిలేదు, మీ బంధు మిత్రులు లేదా మీకు ఇష్టమై స్నేహితులతో కలిసి సరదగా పార్క్కు వెళ్లి గేమ్స్ ఆడుతూ సరదాగా గడపచ్చు. దీని వలన రోజంతా చాలా సంతోషంగా ఉంటారు.