మాజీ ప్రపంచ సుందరి అందా విందు..పూల డ్రెస్‌తో గ్లామర్ ట్రీట్!

samatha 

11 february 2025

Credit: Instagram

మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. 

ఈ అమ్మడు గ్లామర్‌కు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇక ఎప్పుడూ చూడటానికి సింపుల్‌గా కనిపిస్తూ కుర్రకారు మనసు దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. 

తాజాగా ఈ బ్యూటీ తన లేటెస్ట్ ఫొటో షూట్‌తో అభిమానులకు గ్లామర్ ట్రీట్ ఇచ్చింది.మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఈబ్యూటీ సినిమాలపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం లేదనే చెప్పాలి. ఇప్పటికీ ఈ బ్యూటీ చేసిన సినిమాలు చాలా తక్కువే.

సామ్రాట్ పృథ్వీ అనే సినిమాతో నటిగా పరిచయమైంది ఈ అమ్మడు. కానీ ఈమూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.

ఈ సినిమా తర్వాత ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ, ఆపరేషన్ వాలెంటైన్, బడే మియాన్ చోటే మియాన్ వంటి చిత్రాల్లో నటించింది.

ఈ బ్యూటీ సినిమాలు చేయకున్నా తన అభిమానులతో మాత్రం ఎప్పుడూ టచ్‌లోనే ఉంటుంది. ఎప్పటికప్పుడు వరస ఫొటోషూట్స్‌తో కుర్రకారు మనసు దోచేస్తుంది.

తాజాగా మానుషి పూల డ్రెస్ ధరించి అందంతో అదరహో అనిపించింది. చూడటానికి చాలా సింపుల్ లుక్‌లో.. కొంటె చూపుతో వావ్ అనిపించింది.

ప్రస్తుతం  మానుషి చిల్లర్‌కు సంబంధించిన ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరీ ఈ ఫొటోస్ పై మీరు కూడా ఓ లుక్ వేయండి.