చాణక్య నీతి : ఈ నాలుగు విషయాల్లో అస్సలే సిగ్గుపడకూడదంట!

samatha 

10 february 2025

Credit: Instagram

ఆచార్య చాణక్యుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన గొప్పతత్వవేత్త, పండితుడు. ఈయన  అనేక విషయాల గురించి తెలియజేయడం జరిగింది.

ముఖ్యంగా మానవవాళికి ఉపయోగపడే ఎన్నో విషయాలను ఈయన తన నీతిశాస్త్రంలో పొందుపరిచారు. దీని ద్వారా చాలా విషయాలు తెలుసుకోవచ్చు.

అయితే ఆచార్య చాణక్యుడు ఒక వ్యక్తి నాలుగు విషయాల్లో అస్సలే సిగ్గుపడకూడదు అని తెలిపారు. అవి ఏవో తెలుసుకుందాం.

తిండి విషయంలో అసలే సిగ్గుపడకూడదంట. ఎవరింటికైనా వెళ్లి లేదా, ఏదైనా ప్రదేశంలో తినాల్సి వస్తే, సిగ్గుపడకుండా ఆకలి తీరే వరకు తినాలంట.

డబ్బులు ఎవరికైనా ఇచ్చి, మళ్లీ తిరిగి అడగడం లేదా తిరిగి తీసుకునే విషయంలో కూడా అస్సలే సిగ్గుపడకూడదు అంటున్నారు ఆచార్య చాణక్యుడు.

అంతే కాకుండా జ్ఞానాన్ని సంపాదించుకునే విషయంలో కూడా ఏ వ్యక్తి అస్సలే సిగ్గుపడకూడదంట.కొంత మంది ఇతరులను ఏదైనా అడగటానికి ఇబ్బందిగా ఫీల్ అవుతారు.

ఏ వయసు వారైనా సరే తెలియని విషయాన్ని చిన్న పిల్లల నుంచి తెలుసుకోవాల్సిన పరిస్థితి వస్తే సిగ్గు పడకుండా వారిని అడిగి ఆ విషయాన్ని తెలుసుకోవాలి. ఏవయసు వారైనా ఏదైనా నేర్చుకోవచ్చు అన్నారు .

అలాగే ఒక పని ప్రారంభించిన తర్వాత అందులో విఫలం అవుతామని, లేదా ఆ పని చేసేందుకు భయపడటం, పని చేసేందుకు సిగ్గుపడకూడదంట. సిగ్గు పడటం వలన పనులు కావు కాబట్టి ఏ పనైనా సరే చేయాలి.