ఇంట్రెస్టింగ్ : పాము కుబుసం ఎందుకు విడుస్తుందో తెలుసా?

samatha 

10 february 2025

Credit: Instagram

పాముల గురించి అందరికీ తెలిసిందే. ఇవి చెట్ల పొదలు, రాళ్లు, ఇంటి గోడలకు ఉండే కన్నాల మధ్య, పొలాల్లో ఉంటాయి. ఎక్కువ చిత్తడిగా ఉండే ప్రదేశంలో తిరుగుతాయి.

ఇక పాములను చూస్తే చాలా మంది భయపడిపోతుంటారు. ఎందుకంటే అవి చూడటానికి అలా ఉంటాయి. అంతే కాకుండా వాటిలో ఉండే విషం చాలా ప్రమాదకరం.

ఇక పాములకు సంబంధించిన అనేక వార్తలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొత్త రకం పాము దర్శనం, పాములు పగబడతాయి. ఇలా ఎన్నో విషయాలు నెట్టింట హల్ చల్ చేస్తాయి.

అయితే చాలా పాము కుబుసం గురించి చాలా మందికి తెలుసు. అప్పుడప్పుడు ఇవి మన కంట పడుతుంటాయి. అసలు పాములు కుబుసం ఎందుకు విడుస్తాయి అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది.

ప్రస్తుతం భూమిపై ఎన్నోరకాల పాములున్నాయి. అయితే అందులో ఎన్నిరకాల పాములు కుబుసం విడుస్తాయి. అసలు పాము కుబుసం ఎందుకు విడుస్తుందో చాలా మందికి తెలియదు. కాగా, దాని గురించే తెలుసుకుందాం.

కుబుసం విడవడం అనేది పాముల్లో జరిగే సహజమైన ప్రక్రియనంట. ఇది పాము శరీరంపై ఉండే ఓ సన్నని పొర. పాములు పాత పొర కింద కొత్త పొర ఏర్పడటంతో వాటిని వదిలేస్తాయంట.

ముఖ్యంగా పాములు తమ చర్మం పై ఉన్న పొర చాలా బిగుతుగా మారిపోయి, కొత్త పొర ఏర్పడినప్పుడు పాత పొరను వదిలేస్తాయంట. దీన్ని కుబుసం విడవడం అంటారంట.

ఇక పాము కుబుసం విడవటం కోసం ఓ గరుకు ప్రదేశాన్ని చూసి, దానికి తన శరీరాన్ని వేసి రుద్దుకుంటుంది. అప్పుడు పొరపై చీలిక ఏర్పడటంతో దాని నుంచి ఏక మొత్తంలో పాత పొరను వదిలేస్తూ బయటకు వస్తుంది.