వాస్తు టిప్స్: ఇంట్లో నెమలి పించం ఉంటే ఎన్ని లాభాలో..

samatha 

14 february 2025

Credit: Instagram

నెమలి పించం చూడటానికి చాలా కలర్ ఫుల్‌గా కనిపిస్తుంటుంది. దీంతో ఈ రోజుల్లో చాలా మంది దీనిని ఇంటిలో షోకేజ్ కోసం పెట్టుకుంటున్నారు.

ముఖ్యంగా ఈ నెమలి పించాలు చిన్న పిల్ల పుస్తకాల్లో కనిపిస్తుంటాయి. వీటిని వారు ఎంతో భద్రంగా దాచుకుంటారు.

అయితే మన ఇంట్లో ఎట్రాక్షన్ కోసం పెట్టుకునే ఈ నెమలి పించం వలన అనేక  లాభాలు ఉన్నాయి అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అవి ఏవో చూద్దాం.

 కొందరికి ఏ పని చేసినా కలిసి రాదు, ముఖ్యంగా ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటారు. అయితే అలాంటి వారు నైట్ పడుకునే సమయంలో దిండు కింద నెమలి పించం పెట్టుకోవడం వలన నెగటీవ్ ఎనర్జీ పోతుందంట.

మీరు అనుకున్న పనులు సరైన సమయానికి జరగకపోయినా, చేసిన ప్రతి పనిలో సమస్యలు ఎదురైనట్లైతే అలాంటి వారు, ఇంట్లోని బెడ్‌రూంలో తూర్పు లేదా ఈశాన్యం మూలలో నెమలి ఈకను ఉంచితే చాలా మంచిదంట.

మీ ఇంటి ముందు, వినాయకుడి విగ్రహంతో పాటు, నెమలిపించం పెట్టడం వలన వాస్తు దోషం పోతుంది అంటున్నారు పండితులు.

అలాగే పిల్లలు చదవడంలో వెనకబడినా, లేదా చదువుపై ఇంట్రెస్ట్ చూపకపోయినా, నెమలి పించం వారి పుస్తకాల్లో పెట్టడం వలన వారిలో పాజిటివ్ ఎనర్జీ వచ్చి బాగా చదువుతారంట

నెమలి పించం ఇంట్లో లేదా మన పూజ గదిలో పెట్టి ప్రతి రోజూ పూజ చేయడం వలన గ్రహదోషాలు పోతాయని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.