వాలెంటైన్స్ డే స్పెషల్.. కొప్పులో పూలతో దర్శనం ఇచ్చిన రష్మీ..
samatha
15 February 2025
Credit: Instagram
బుల్లితెర ముద్దుగుమ్మ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌తో ప్రేమాయణం వలన యూత్‌లో మరింత క్రేజ్ సంపాదించుకుంది.
వీరు ప్రేమలో ఉన్నారంటూ గాసిప్స్ వచ్చాయి. కానీ ఇవన్నీ ఓన్లీ సెట్స్ వరకే, మేము మంచి స్నేహితులం అంటూ సుధీర్, రష్మీ చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు.
ఇక సుధీర్ సినిమాలతో బిజీ కావడంతో, జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. దీంతో సుధీర్, రష్మీ గ్రాఫ్ చాలా వరకు తగ్గింది. మా ఫేవరేట్ సుధీర్ రష్మీ ఎక్కడా అంటూ అసహనం వ్యక్తం చేశారు.
దీంతో రీసెంట్‌గా వీరు కలిసి ఈటీవీలో సంక్రాంతికి స్పెషల్ ఈవెంట్ చేసి తమ అభిమానులను ఆనందపరిచారు. బుజ్జితల్లీ అంటూ.. ఆడి పాడి ఈవెంట్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ వరస ఫొటో షూట్స్‌తో నెట్టింట్లో తెగ సందడి చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ కొప్పున మల్లె పూలు పెట్టుకొని తన అందాలతో బాణాలు విసిరింది.
రష్మీ గోల్డ్ కలర్ శారీలో, కొప్పులో మల్లె పూలు పెట్టుకొని ఫొటోలకు ఫోజులిచ్చింది. ఫొటోల్లో చూడటానికి చాలా ట్రెడిషనల్‌గా ఉంది ఈ అమ్మడు.
ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. స్లీవ్ లెస్ బ్లౌజ్, కొప్పు చుట్టూ పూలు పెట్టుకొని చాలా బ్యూటీఫుల్‌గా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు తమ అభిమానులు.
ఇంకొందరు చీరలో చూడచక్కగా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరీ వాలెంటైన్స్ డే స్పెషల్‌గా జబర్దస్త్ బ్యూటీ యాంకర్ రష్మీ షేర్ చేసిన లేటేస్ట్ ఫొటోలపై మరు కూడా ఓ లుక్ వేయండి.